LIC IPO Update: ఎల్​ఐసీ ఐపీఓ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్​. ఈ నెలలో ఎల్​ఐసీ ఐపీఓకు వస్తుందని భావించినా.. అది జరగకకపోవచ్చని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తున్న కారణంగా అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్​ఐసీ ఐపీఓను మరోసారి సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కూడా స్వయంగా ఈ విషయంపై స్పందించారు. ప్రముఖ వార్తా పత్రిక బిజినెస్ లైన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రభుత్వం ఎల్​ఐసీ ఐపీఓను త్వరలో పూర్తి చేయాలనే ఆలోచనతోనే ఉందని వివరించారు. అయితే రష్యా-ఉక్రెయన్​ మధ్య సంక్షోభం నేపథ్యంలో.. ఐపీఓపై పునరాలోచనలో పడినట్లు చెప్పారు.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో.. ఐపీఓ ఎప్పుడు వస్తుందనే విషయంపై మరోసారి సందిగ్ధత నెలకొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించడం లేనందన.. ఐపీఓను వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేసే అవకాశాలున్నాయని అంచనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఐపీఓకు సంబంధం ఏమిటి?


ప్రపంచవ్యాప్తంగా ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా ఆ ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా పడుతుంది. ఇందుకు కారణం ఆయా దేశాల మధ్య ఉండే వ్యాపార, వాణిజ్య సంబంధాలు.. ఆర్థికపరమై సంబగంధాలు కారణం కావచ్చు.


అందుకే రష్యా వంటి సుపర్​ పవర్​ దేశం ఇప్పుడు యుద్ధంలో ఉండటం.. ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకోవడం వంటివి ప్రపంచ దేశాలపై ప్రతికూలక ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో గత వారం రోజులుగా దేశీయంగా, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లన్నీ కుదేలవుతున్నాయి. ఇలాంటి సమయాల్లో ఎల్​ఐసీ ఐపీఓకు రావడం వల్ల.. అనుకున్న లక్ష్యాలు నెరవేరకపోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే ఎల్​ఐసీ ఐపీఓను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


Also read: Electricity bill: వేసవిలో కరెంటు బిల్లు తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!


Also read: WhatsApp Banned Accounts: జనవరిలో 18.58 లక్షల భారతీయ ఖాతాలను బ్లాక్ చేసిన వాట్సప్ సంస్థ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook