WhatsApp Banned Accounts: జనవరిలో 18.58 లక్షల భారతీయ ఖాతాలను బ్లాక్ చేసిన వాట్సప్ సంస్థ!

WhatsApp Banned Accounts: ఈ ఏడాది జనవరిలో దాదాపుగా 18.58 భారతీయ ఖాతాలను నిషేధించినట్లు వాట్సప్ సంస్థ ప్రకటించింది. వాట్సప్ నిర్దేశించిన చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా.. తమకు అందిన ఫిర్యాదుల కారణంగా అన్ని ఖాతాలను బ్యాన్ చేసినట్లు సదరు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 11:05 AM IST
    • 18.58 లక్షల భారతీయ అకౌంట్స్ ను బ్యాన్ చేసిన వాట్సప్
    • నిబంధనలు ఉల్లంఘన, ఫిర్యాదుల మేరకు నిషేధించినట్లు ప్రకటన
    • విచారణ తర్వాత సదరు వాట్సప్ అకౌంట్స్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడి
WhatsApp Banned Accounts: జనవరిలో 18.58 లక్షల భారతీయ ఖాతాలను బ్లాక్ చేసిన వాట్సప్ సంస్థ!

WhatsApp Banned Accounts: కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన నివేదిక ప్రకారం.. ప్రముఖ మెసేంజర్ ఫ్లాట్ ఫారమ్ వాట్సప్ గత నెల జనవరిలో దాదాపుగా 18.58 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది. వాట్సప్ నిర్దేశించిన చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా.. తమకు అందిన ఫిర్యాదుల కారణంగా అన్ని ఖాతాలను నిషేధించినట్లు తెలుస్తోంది. 

అందులో 495 వాట్సప్ ఖాతాలపై ఫిర్యాదులు అందగా.. వాటిలో 24 అకౌంట్స్ ను నిషేధించారు. అయితే బ్యాన్ చేయపడిన ఖాతాల్లో ఎక్కువ మంది యాప్ వనరులను దుర్వినియోగం చేసేనందుకే నిషేధించారని సమాచారం. 

"జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు దాదాపుగా 18.58 లక్షల ఖాతాలు నిబంధనలను ఉల్లంఘించాయని వాట్సప్ గుర్తించింది. రిపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని సదరు వాట్సప్ అకౌంట్స్ ను బ్లాక్ చేయడం జరిగింది. విచారణలో వారికి ప్రతికూలంగా ఫీడ్ బ్యాక్ వస్తే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది" అని వాట్సప్ ఇండియా మంత్లీ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. +91 ISD కోడ్ ద్వారా భారతీయ నంబర్లుగా వాట్సప్ పరిగణిస్తుంది.  

Also Read: Accenture Jobs: ఐటీ ఎంప్లాయిస్‌కి గుడ్ న్యూస్.. ఇక టైర్-2 నగరాల్లోకి యాక్సెంచర్

Also Read: Flipkart Smartphone Offer: రూ.17,000 విలువైన Motorola స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.451లకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News