LIC Plan: ఎల్ఐసీ..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మరో సరికొత్త స్కీమ్ లాంచ్ చేసింది. నెలకు 4 వేల పెట్టుబడితో 30 లక్షలు సంపాదించే పధకం. ఆ పథకం వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్ఐసీలో పలు ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో పెద్దోళ్ల నుంచి చిన్నపిల్లల వరకూ ప్రతి ఒక్కరికీ ప్లాన్స్ ఉన్నాయి. పిల్లలకు ఎల్ఐసీ పాలసీ చేయించవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. కానీ ఎల్ఐసీలో నేరుగా చిన్న పిల్లలకు కూడా పాలసీలు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని మర్చిపోతుంటారు. 


ఎల్ఐసీలో బాలుర కోసం ప్రత్యేకంగా ఒక ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ పేరు జీవన్ తరుణ్. ప్లాన్ నెంబర్ 934. జీవన్ తరుణ్ అనేది ప్రత్యేకంగా బాలుర కోసం ఉద్దేశించింది. ఇందులో 25 ఏళ్ల వయస్సు వరకూ పాలసీ చేయించవచ్చు. ఈ ప్లాన్‌ను మూడు నెలల వయస్సు నుంచి 12 ఏళ్ల వరకూ ఉన్నప్పుడు ప్రారంభించవచ్చు. పాలసీ మినిమమ్ ఎస్యూర్డ్ 75 వేలుండాలి. అత్యధికమంటూ పరిమితి లేదు. ఎంతైనా చేసుకోవచ్చు.


ఈ పాలసీ పిల్లల వయస్సు 245 ఏళ్లు వచ్చేవరకూ కొనసాగుతుంది. 25 ఏళ్లకు చేరుకున్నప్పుడు పాలసీ మెచ్యూర్ ఎమౌంట్ చేతికి అందుతుంది. పిల్లవాడి వయస్సు ప్రకారం ఈ ప్లాన్‌లో పాలసీ టర్మ్ ఖరారవుతుంది. ఉదాహరణకు ఒకవేళ బాలుడి వయస్సు మూడేళ్లైతే..పాలసీ టర్మ్ 22 ఏళ్లు కొనసాగుతుంది. అదే బాలుడి వయస్సు 10 ఏళ్లైతే..టర్మ్ 15 ఏళ్లు ఉంటుంది. బాలుడి వయస్సు 12 ఏళ్లైతే టర్మ్ 13 ఏళ్లకు ఉంటుంది. ఈ ప్లాన్‌లో ప్రత్యేకత ఏంటంటే..బాలుడి వయస్సు 25 ఏళ్లు పూర్తయినప్పుడే ఒకేసారి నగదు మొత్తం తీసుకోవచ్చు. లేదా 20 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపున్నప్పుడు ప్రతియేటా కొద్ది మొత్తం నగదు తీసుకోవచ్చు. ఈ పాలసీ ప్రారంభించేటప్పుడు మనీ బ్యాక్ ఆప్షన్ ఎంచుకోవల్సి ఉంటుంది. ఒకవేళ 5 శాతం మనీ బ్యాక్ ఆప్షన్ తీసుకుంటే..20 నుంచి 24 ఏళ్ల వరకూ 5 శాతం చొప్పున అందగా..మిగిలిన 75 శాతం మెచ్యూరిటీ పూర్తయ్యాక అందుతుంది. 


నెలకు నాలుగు వేలు..30 లక్షల మెచ్యూరిటీ


పిల్లోడు పుట్టిన వెంటనే ఏడాది వయస్సులోనే జీవన్ తరుణ్ మొదలెట్టాలి. అప్పుడు టర్మ్ 25 ఏళ్లుంటుంది. దాంతోపాటు 25 ఏళ్ల వయస్సులో ఒకేసారి నగదు తీసుకునే ఆప్షన్ తీసుకోవాలి. సమ్ ఎస్యూర్డ్ 12 లక్షలు ఉండాలి. అప్పుడు మొదటి ఏడాది నెలకు 4 వేల 368 రూపాయల ప్రీమియం కాగా, రెండవ ఏడాది నుంచి నెలకు 4 వేల 274 రూపాయలుంటుంది. ఇలా 25 ఏళ్లు చెల్లిస్తే..మెచ్యూరిటీ పూర్తయ్యాక..30 లక్షల 90 వేల రూపాయలు చేతికి అందుతుంది. 


Also read: FD Techniques: ఎఫ్‌డి ఎలా వేయాలి, డబ్బులు ఒకేచోట బ్లాక్ కాకూడదంటే ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook