LIC New Plans: న్యూ జీవన్ ఆనంద్ పాలసీతో కోటీశ్వరుడు కావడమెలా, నెలకు 5 వేల పెట్టుబడితో కోటి రూపాయలు
LIC New Plans: ప్రతి ఒక్కరికీ కోటీశ్వరుడు కావాలనే ఉంటుంది. అయితే అందరికీ సాధ్యం కాదు. ఎల్ఐసీలో కొన్ని స్కీమ్స్‌లో చేరితే మీరు కూడా కోటీశ్వరుడు కావచ్చు. ఆ స్కీమ్స్ ఏంటో చూద్దాం.
LIC New Plans: ప్రతి ఒక్కరికీ కోటీశ్వరుడు కావాలనే ఉంటుంది. అయితే అందరికీ సాధ్యం కాదు. ఎల్ఐసీలో కొన్ని స్కీమ్స్‌లో చేరితే మీరు కూడా కోటీశ్వరుడు కావచ్చు. ఆ స్కీమ్స్ ఏంటో చూద్దాం.
ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెడితే కచ్చితంగా కోటీశ్వరుడిగా మారుతారు. ఎల్ఐసీ వద్ద అలాంటివే చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఎల్ఐసీ ప్లాన్స్‌తో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టడం ద్వారా మెచ్యూరిటీ పూర్తయ్యాక..రిటర్న్ డబ్బు పెద్దమొత్తంలో తీసుకోవచ్చు. ఎల్ఐసీ స్కీమ్‌లో న్యూ జీవన్ ఆనంద్ అనేది ఒక మంచి పథకం. న్యూ జీవన్ ఆనంద్ చాలా ప్రత్యేకమైంది. ఈ పాలసీ ఎల్ఐసీ మోస్ట్ పాపులర్, బిగ్గెస్ట్ సెల్లర్. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే మెచ్యూరిటీ తరువాత కూడా రిస్క్ కవర్ ఉంటుంది.
న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ వివరాలు
ఈ ప్లాన్ ప్రారంభించేందుకు కనీస వయస్సు 18 నుంచి 50 ఏళ్లుండాలి. పాలసీ కనీస మొత్తం 1 లక్ష రూపాయలు కాగా, మ్యాగ్జిమమ్ పరిమితి లేదు. టెర్మ్ కనీసం 15 ఏళ్లు అత్యధికంగా 35 ఏళ్లు ఎంచుకోవచ్చు. మెచ్యూరిటీ తరువాత కూడా భీమా మొత్తానికి తగ్గట్టుగా రిస్క్ కవరేజ్ ఉంటుంది.
30 ఏళ్ల వయస్సులో ప్రారంభంచి కోటీశ్వరుడు కావడం ఎలా
ఒకవేళ మీరు 30 ఏళ్ల వయస్సులో ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ ప్రారంభిస్తే..ఈ ప్లాన్‌లో ఇన్సూరెన్స్ పాలసీ 21 లక్షలకు తీసుకోవాలి. అటు టర్మ్ 35 ఏళ్లు ఎంచుకోవాలి. తొలి ఏడాది నెలకు 5 వేల 541 రూపాయలు చెల్లించాలి. అటు రెండవ ఏడాది నుంచి టర్మ్ పూర్తయ్యేవరకూ ప్రతి నెలా 5 వేల 421 రూపాయలు ప్రీమియమ్ వాయిదా చెల్లించాలి. దీంతోపాటు 65 ఏళ్ల వయస్సులో పాలసీ మెచ్యూరిటీ అయినప్పుడు 1 కోటీ 3 లక్షల 11 వేలు అందుతాయి.
Also read: Samsung Galaxy M52 Price Drop: శాంసంగ్ గెలాక్సీ ఎం52పై భారీగా 30 శాతం డిస్కౌంట్, మరి కొద్దిరోజులే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.