దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఇప్పుడు యాక్సిస్ , ఐడీబీఐ బ్యాంకుల టైఅప్‌తో క్రెడిట్ కార్డులు అందిస్తోంది. యూజర్లకు ఇతర ప్రయోజనాలతో పాటు ఇన్సూరెన్స్ చెల్లించే వెసులుబాటు కల్పిస్తాయి ఈ కార్డులు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్ఐసీ అందిస్తున్న క్రెడిట్ కార్డులు ప్రీమియం డిపాజిట్ చేసేందుకు దోహదపడటమే కాకుండా ఇతర చాలా ప్రయోజనాల్ని అందిస్తాయి. యాక్సిస్ బ్యాంకుతో టైఅప్‌తో ఎల్ఐసీ మూడు రకాల క్రెడిట్ కార్డులు అందిస్తోంది. అందులో ఎల్ఐసీ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ ప్లాటినం క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ టైటానియం క్రెడిట్ కార్డు. ఎల్ఐసీ క్రెడిట్ కార్డు వినియోగంతో కలిగే లాభాలేంటో చూద్దాం.


ఎల్ఐసీ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు


ఎల్ఐసీ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు మీరు చెల్లించే ప్రతి వంద రూపాయలు ప్రీమియం డిపాజిట్‌కు 2 రివార్డు పాయింట్లు అందిస్తుంది. అంతేకాకుండా మీరు ఖర్చు చేసే ప్రతి వంద రూపాయలకు 1 రివార్డు పాయింట్ లభిస్తుంది. ఈ కార్డు పోగొట్టుకుంటే ఇన్సూరెన్స్ కవరేజ్ కాంప్లిమెంటరీగా అందుతుంది. వ్యక్తిగత ప్రమాద భీమా 5 లక్షల వరకూ ఉంటే..ఎయిర్ యాక్సిడెంట్ కవరేజ్ 1 కోటి రూపాయలుంటుంది. 400 నుంచి 4000 రూపాయల లావాదేవీలు జరిపితే ఫ్యూయర్ సర్‌ఛార్జ్ 1 శాతం తగ్గుతుంది. దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో ఈ కార్డు ద్వారా లాంజ్ యాక్సెస్ పొందవచ్చు.


ఎల్ఐసీ ప్లాటినం క్రెడిట్ కార్డు


ఇందులో మీరు చెల్లించే ప్రతి వంద రూపాయల ప్రీమియం డిపాజిట్‌పై 2 రివార్డు పాయింట్లు లభిస్తాయి. వ్యక్తిగత ప్రమాద భీమా 3 లక్షలు కాగా, ఎయిర్ యాక్సిడెంట్ బీమా 1 కోటి రూపాయలుంది. దీంట్లో కూడా కాంప్లిమెంటరీ లాస్ట్ క్రెడిట్ కార్డు వర్తిస్తుంది. పెట్రోల్ పంపుల్లో లావాదేవీలపై 1 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ తగ్గుతుంది. 


ఎల్ఐసీ టైటానియం క్రెడిట్ కార్డు


ఇందులో కూడా మీరు కార్డు ద్వారా చెల్లించే ప్రతి వంద రూపాయల ఎల్ఐసీ ప్రీమియం డిపాజిట్‌పై 2 రివార్డు పాయింట్లు లభిస్తాయి. ప్రతి వంద రూపాయల ఇతర ఖర్చులపై 1 రివార్డు పాయింట్ వస్తుంది. దేశంలోని పెట్రోల్ పంపుల్లో 400 నుంచి 4000 మధ్య జరిపే లావాదేవీలపై ఫ్యూయల్ సర్‌ఛార్జ్ 1 శాతం తగ్గుతుంది.


Also read: LIC Policy: 1358 రూపాయల పెట్టుబడితో మెచ్యూరిటీ అనంతరం 25 లక్షలు పొందండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook