LIC Superhit Scheme: ఎల్ఐసీలో ఉన్న వివిధ రకాల పాలసీల్లో జీవన్ ఆనంద్ పాలసీ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో మీరు రోజుకు 45 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు..మెచ్యూరిటీ అనంతరం ఏకంగా 25 లక్షల నగదు పెద్దమొత్తంలో ఒకేసారి పొందవచ్చు. ఈ పాలసీ వివరాలు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది ఎల్ఐసీ ఆఫర్ చేస్తున్న సూపర్ హిట్ స్కీమ్. ఈ స్కీమ్ పేరు జీవన్ ఆనంద్. మీ వయస్సు 30 ఏళ్లు అనుకుంటే 5 లక్షలకు పాలసీ తీసుకుంటే మీరు చెల్లించాల్సిన ప్రీమియం నెలకు 1341 రూపాయలు. అంటే రోజుకు లెక్కేస్తే కేవలం 45 రూపాయలు. ఓ పాల ప్యాకెట్ ధర కంటే కొద్దిగా ఎక్కువ. ఇలా 35 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 35 ఏళ్ల తరువాత ఒకేసారి 25 లక్షల రూపాయలు అందుకోవచ్చు. ఇందులో 5 లక్షలు పాలసీ, 8.50 లక్షలు బోనస్, 11.50 లక్షలు అడిషనల్ బోనస్. మొత్తం కలిపితే 25 లక్షలు అవుతుంది. 


జీవన్ ఆనంద్ పాలసీ ప్రయోజనాలు


ఈ పాలసీలో పాలసీదారుడికి రిస్క్ కవరేజ్ కింద కనీసం 6.25 లక్షల రూపాయలు అందుతాయి. ఇది 30 లక్షల వరకూ పెంచుకోవచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్ల నుంచి 35 ఏళ్లుంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ మీకు నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో 15 ఏళ్లు పాలసీ ఉంటే బోనస్ రెండు సార్లు వస్తుంది. పాలసీ చేయాల్సిన కనీస మొత్తం 1 లక్ష రూపాయలు కాగా గరిష్టంగా పరిమితి లేదు. ఈ పాలసీలో ఇన్‌కంటాక్స్ మినహాయింపు ప్రయోజనం ఉండదు.


ఇందులో ప్రమాద భీమా, డిజెబిలిటీ భీమా, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టెర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ బెనిఫిట్ రైడర్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. దురదృష్ణవశాత్తూ పాలసీదారుడు మరణిస్తే నామినీకు 125 శాతం పాలసీ నగదు అందుతుంది. 


Also read: Income Tax Refund Updates: మీకు ఇన్‌కంటాక్స్ రిఫండ్ ఇంకా అందలేదా, కారణం ఏమై ఉంటుందో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.