లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలు ప్రకటిస్తుంటుంది. ఈసారి పెన్షన్ లింక్డ్ పాలసీతో అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తోంది. ఆ పాలసీ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని అతిపెద్ద భీమా రంగ సంస్థ ఎల్ఐసీ ఇప్పుడు న్యూ జీవన్ శాంతి పాలసీని ప్రారంభించింది. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెడితే..జీవితాంతం పెన్షన్ అందుకునే అవకాశముంది. వృద్ధాప్యంలో ఖర్చుల కోసం ఆలోచిస్తుంటే..ఈ పాలసీ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీ వృద్ధాప్యాన్ని సెక్యూర్ చేసేందుకు మంచి పథకమిది. న్యూ జీవన్ శాంతి పాలసీలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఇందులో ఒక్కసారే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. జీవితమంతా పెన్షన్ గ్యారంటీ లభిస్తుంది. ఫలితంగా వృద్ధాప్యంలో ఆర్ధికపరమైన ఇబ్బందులుండవు.


న్యూ జీవన్ శాంతి పాలసీ ఏమిటి


ఈ పథకం ఎల్ఐసీకు చెందిన పాత జీవన్ పాలసీ లాంటిదే. జీవన్ శాంతి పాలసీలో మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటిది తక్షణ ఎన్యుటీ కాగా రెండవది డిఫర్డ్ ఎన్యుటీ. ఇదొక సింగిల్ ప్రీమియం ప్లాన్. మొదటి తక్షణ ఎన్యుటీలో పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ సౌలభ్యం లభిస్తుంది. ఇక రెండవ డిఫర్డ్ ఎన్యుటీలో పాలసీ తీసుకున్న తరువాత అంటే 5,10,15 లేదా 20 ఏళ్ల తరువాత పెన్షన్ సౌలభ్యం కలుగుతుంది. 


పెన్షన్ ఎంత వస్తుంది


ఈ పాలసీలో పెన్షన్ గ్యారంటీ ఉంది. మీ పెట్టుబడి, వయస్సు, డిఫర్మెంట్ పీరియడ్ ప్రకారం పెన్షన్ ఎంతనేది వర్తిస్తుంది. పెట్టుబడి,పెన్షన్ ప్రారంభానికి మధ్య కాలవ్యవధి ఎంత ఎక్కువగా ఉంది లేదా వయస్సు ఎంత ఎక్కువగా ఉందో పెన్షన్ కూడా అంతే లభిస్తుంది. ఎల్ఐసీ పెట్టుబడి ఆదారంగా పెన్షన్ అందిస్తుంది.


ఎవరికి ప్రయోజనం


ఎల్ఐసీ పాలసీ కోసం కనీస వయస్సు 30 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 85 ఏళ్లుగా ఉంది. అంతేకాకుండా జీవన్ శాంతి పాలసీలో రుణం, పెన్షన్ ప్రారంభమైన 1 ఏడాది తరువాత దీన్ని సరెండర్ చేయవచ్చు. పెన్షన్ ప్రారంభమైన 3 నెలల తరువాత అందించవచ్చు. రెండు ఆప్షన్లలో పాలసీ తీసుకునేటప్పుడు ఏడాది వడ్డీ గ్యారంటీ ఉంటుంది. ఈ పాలసీలో విభిన్నమైన వార్షిక ప్రత్యామ్నాయాలు, వార్షిక చెల్లింపుల సౌలభ్యముంది. ఒకసారి ఎంచుకున్న ఆప్షన్‌ను తిరిగి మార్చేందుకు వీలుండదు. ఈ పాలసీని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు.


Also read: Demat Account: షేర్ ట్రేడింగ్ చేస్తున్నారా, మీ డీమ్యాట్ ఎక్కౌంట్‌లో మోసం జరిగే ప్రమాదముంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook