లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భీమా సంస్థ జీవన్ అక్షయ్ అంటూ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ తీసుకునేవారికి ప్రతినెలా పెన్షన్ అందుతుంది. ఈ పాలసీని తమ కోసం లేదా తమకు ఇష్టమైన వారి కోసం జీవన్ అక్షయ్ పాలసీని తీసుకోవాలని ఎల్ఐసీ సూచించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకసారి జీవన్ అక్షయ్ పాలసీలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లయితే మీకు ప్రతినెలా పింఛన్ లభిస్తుందని ఓ ప్రకటనలో లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) తెలిపింది. ఇందులో ఇన్వెస్ట్ చేసేవారు నెల పింఛన్, మూడు నెలలకు పింఛన్, 6 నెలలకు పింఛన్, లేదా ఏడాదికి ఒకసారి పింఛన్ అందుకునేలా ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. 30 నుంచి 85 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవారు జీవన్ అక్షయ్ పాలసీ తీసుకునే అవకాశం ఉంది. కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి సైతం జాయింట్ ఇన్వెస్టర్లుగా మారే సదుపాయాన్ని ఎల్ఐసీ కల్పించింది.


Also Read: Gold Rate Today In Hyderabad: బులియన్ మార్కెట్లో స్థిరంగా బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు


ఎల్ఐసీ అందిస్తున్న జీవన్ అక్షయ్ (Jeevan Akshay Policy) పాలసీదారులకు ఎలాంటి రుణం(Loan) సదుపాయం కల్పించడం లేదని పేర్కొన్నారు. ఇందులో చేరాలంటే కనీసం రూ.1 లక్ష రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. ఒకవేళ మీరు రూ.9,00,000 మొత్తాన్ని పాలసీ కోరుకుంటే కనుక రూ.9,16,200 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో పెట్టుబడి ద్వారా మీకు ఒక శాతం పన్ను మినహాయింపు లభిస్తుందని జీ న్యూస్ రిపోర్ట్ చేసింది. 


Also Read: Also Read: Fertility Myths: సంతానలేమిపై మగవారిలో 5 ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలు


జీవన్ అక్షయ్ పాలసీలో నగదు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారికి ప్రతినెలా రూ.6,859 పింఛన్ లభిస్తుంది. త్రైమాసికానికి రూ.20,745 మొత్తం, ఆరు నెలలకు అయితే రూ.42,008, వార్షికంగా అయితే రూ.86,265 మొత్తం పింఛన్ అందించనున్నామని భారత జీవిత భీమా సంస్థ ఎల్ఐసీ స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook