Personal loan Interest Rates: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండి
Personal loan Interest Rates: ఇటీవలి కాలంలో పర్సనల్ లోన్లకు డిమాండ్ అధికమైంది. ఎప్పటికప్పుడు అత్యవసరంగా వచ్చి పడే ఆర్ధిక అవసరాల్ని తీర్చుకునేందుకు వ్యక్తిగత రుణాలు బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. అయితే ఏ బ్యాంకులు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం.
Personal loan Interest Rates: సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడేది లోన్లపైనే. ఆర్ధిక అవసరాలు తీర్చుకునేందుకు ఇవి అవసరం. కొందరు గోల్డ్ లోన్ తీసుకుంటే మరి కొందరు ప్రోపర్టీపై లోన్ తీసుకుంటారు. ఎక్కువమంది పర్సనల్ లోన్లు పొందుతుంటారు. ఉద్యోగం చేస్తూ, సిబిల్ స్కోర్ బాగుంటే చాలు ఎలాంటి ఇతర గ్యారంటీల్లేకుండా ఇచ్చేదే పర్సనల్ లోన్.
స్మార్ట్‌ఫోన్, ఆన్‌లైన్ చెల్లింపులు వచ్చాక పర్సనల్ లోన్ అనేది చాలా సులభమైపోయింది. అప్లై చేసిన క్షణాల్లో లోన్ మంజూరవడం, బ్యాంకులో క్రెడిట్ అవడం జరిగిపోతుంది. నిర్ణీత మొత్తంలో జీతం తీసుకునే ఉద్యోగి అయి ఉండి, సిబిల్ స్కోర్ బాగుంటే చాలు పర్సనల్ లోన్ చాలా సులభంగా మంజూరవుతుంటుంది. దాదాపు అన్ని బ్యాంకులు పర్సనల్ లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఏ బ్యాంకులో తీసుకుంటే మంచిదో తెలియక ఇబ్బంది పడుతుంటారు. పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తుందో చెక్ చేసుకుని తీసుకోవల్సి ఉంటుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ బ్యాంకులు పర్సనల్ లోన్లకు ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తున్నాయో తెలుసుకుందాం.
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యక్తిగత రుణాలకు 12.30 నుంచి 14.30 శాతం వరకూ వసూలు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకైతే 11.30 శాతం నుంచి 13.80 వరకూ వసూలు చేస్తుంది. అదే రక్షణ రంగంలో పనిచేసేవారికి ఇంకాస్త తక్కువగా 11.25 శాతం నుంచి 12.65 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తోంది.
2. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పర్సనల్ లోన్‌పై 13.15 శాతం నుంచి 16.75 శాతం వరకూ వడ్డీ ఛార్జ్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు 12.40 శాతం నుంచి 16.75 శాతం వరకూ వడ్డీ ఉంటుంది.
3. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే వ్యక్తిగత రుణాలపై 13.75 శాతం నుంచి 17.25 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 12.75 శాతం నుంచి 15.25 శాతం వరకూ వసూలు చేస్తుంది.
4. ఇక ఐసీఐసీఐ బ్యాంకు పర్సనల్ లోన్ వడ్డీ ఇతర బ్యాంకులతో పోలిస్తే కాస్త తక్కువే ఉంది. 10.65 శాతం నుంచి 16 శాతం వరకూ వసూలు చేస్తోంది.
5. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు వ్యక్తిగత రుణాలపై 10.5 శాతం నుంచి 24 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తోంది.
6. ఇక కరూర్ వైశ్యా బ్యాంకు పర్సనల్ లోన్లపై 11 శాతం నుంచి 13 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తుంది.
7. యాక్సిస్ బ్యాంకు అయితే వ్యక్తిగత రుణాలపై 10.65 శాతం నుంచి 22 శాతం వరకూ వడ్డీ ఛార్జ్ చేస్తుంది.
అయితే అన్ని బ్యాంకులు మీ సిబిల్ స్కోర్ ఆధారంగా పర్సనల్ లోన్లు మంజూరు చేయడం లేదా వడ్డీ ఎంతనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే వడ్డీ అంత తక్కువగా ఉండే అవకాశాలుంటాయి. అదే సమయంలో ప్రోసెసింగ్ ఫీజు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటుంది. అది కూడా వ్యక్తిని బట్టి మారవచ్చు. అందుకే ప్రోసెసింగ్ ఫీజు కూడా చెక్ చేసుకుని లోన్ కోసం అప్లై చేసుకోవాలి.
Also read: Banks Offer High Interest Rate: ఏడాది ఎఫ్‌డీ పై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల జాబితా మీ కోసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook