LPG Gas Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ సిలెండర్‌పై 300 రూపాయల డిస్కౌంట్ లభించనుంది. అదెలాగో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు గ్యాస్ సిలెండర్ బుక్ చేయాలనుకుంటుంటే..మీ కోసం గుడ్‌న్యూస్ ఒకటి ఉంది. దేశవ్యాప్తంగా ఓ వైపు గ్యాస్ సిలెండర్ ధరలు రోజురోజుకూ పెరుగుతుంటే..మరోవైపు దాదాపు 300 రూపాయలు గ్యాస్ సిలెండర్‌పై డిస్కౌంట్ లభిస్తోంది. ఆశ్చర్యంగా ఉందా..నిజమే. అదెలా సాధ్యం, ఎక్కడనేది తెలుసుకుందాం..


ఇండేన్ గ్యాస్ అందిస్తున్న సౌకర్యం


భారత ప్రభుత్వ ఆయిల్ కంపెనీ ఇండేన్ గ్యాస్ ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ సౌకర్యం ప్రకారం గ్యాస్ సిలెండర్ కేవలం 750 రూపాయలకే లభించనుంది. 


ఇండేన్ గ్యాస్ కంపెనీ ఇటీవలే కాంపోజిట్ గ్యాస్ సిలెండర్ ప్రారంభించింది. ఈ సిలెండర్ ధర కేవలం 750 రూపాయలు మాత్రమే. ఈ సిలెండర్‌ను ఒక చోటి నుంచి మరోచోటికి చాలా సులభంగా బదిలీ చేయవచ్చు. ఈ సిలెండర్ బరువు కూడా ఇతర సిలెండర్లతో పోలిస్తే తక్కువ.


దేశవ్యాప్తంగా గ్యాస్ సిలెండర్ ధర 1000 రూపాయలు దాటేసింది. ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర 1053 రూపాయలుగా ఉంది. కానీ ఇండేన్ గ్యాస్ అందిస్తున్న కాంపాజిట్ గ్యాస్ సిలెండర్ ధర 750 రూపాయలే. ఈ సిలెండర్‌లో 10 కిలోల గ్యాస్ మాత్రమే ఉంటుంది. అందుకే ధర తక్కువ. ఈ సిలెండర్ మొత్తం పారదర్శకంగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో 28 కు పైగా నగరాల్లో అందుబాటులో ఉంది. త్వరలో అన్ని నగరాలకు విస్తరించనుంది. 


Also read: LIC Jeevan Pragati Policy: ఎల్ఐసీలో అద్భుత పథకం, రోజుకు 200లతో మెచ్యురిటీ అనంతరం 28 లక్షలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook