LIC Jeevan Pragati Policy: ఎల్ఐసీ మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. రోజుకు 2 వందల రూపాయలతో మెచ్యూరిటీ అనంతరం 28 లక్షల రూపాయలు ఆర్జించే పథకమిది. ఆ వివరాలేంటో చూద్దాం..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలు ప్రవేశపెడుతుంటుంది. ఇప్పుడు కొత్తగా జీవన్ ప్రగతి పాలసీ ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా...రోజుకు 2 వందల రూపాయలు జమ చేస్తే..మెచ్యూరిటీ పూర్తయిన తరువాత ఏకంగా 28 లక్షల రూపాయలు చేతికి అందుతాయి. మరోవైపు రిస్క్ కవరేజ్, మూడేళ్లకు సరండెర్ విధానం కూడా ఉంది.
ఎల్ఐసీ కస్టమర్లకు చాలా లాభాలు అందిస్తుంటుంది. ఏ విధమైన రిస్క్ లేకుండా ప్రోఫిట్స్ కావాలంటే ఎల్ఐసీ అందించే జీవన్ ప్రగతి పాలసీ బాగుంటుంది. ఈ పాలసీలో రోజుకు 200 రూపాయలు జమ చేయాలి. అంటే నెలకు 6 వేల రూపాయలు. ఈ పథకం వ్యవధి 20 ఏళ్లు. మెచ్యూరిటీ పూర్తయిన తరువాత 28 లక్షలు చేతికి వస్తాయి.
1. జీవన్ ప్రగతి పాలసీలో నిర్ణీత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
2. ఈ పాలసీలో మీకు లైఫ్ కవరేజ్ కూడా లభిస్తుంది. ఇదే ప్రతి ఐదేళ్లకు పెరుగుతుంది.
3. ఈ పాలసీ వ్యవధి కనీసం 12 ఏళ్లు కాగా అత్యధికంగా 20 ఏళ్లు
4. ఈ పాలసీ తీసుకునేందుకు అత్యధికంగా 45 ఏళ్లు దాటకూడదు
5. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు మ్యాగ్జిమమ్ లిమిట్ అంటూ లేదు.
6. ఈ ప్లాన్ నాన్ లింక్డ్, సేవింగ్స్, ప్రొటెక్షన్ లాభాల్ని అందిస్తుంది.
7. ఇందులో ఏడాదికి, మూడు నెలలకు, ఆరు నెలలకు ప్రీమియం చెల్లించవచ్చు.
పాలసీ సమయంలో పాలసీదారుడు మరణిస్తే పాలసీ డబ్బులు నామినీకు అందిస్తారు. ఎల్ఐసీ జీవన్ ప్రగతి పాలసీలో ప్రతి ఐదేళ్లకోసారి రిస్క్ కవర్ అనేది పెరుగుతుంటుంది. ఈ పాలసీలో 3 ఏళ్లు పూర్తయిన తరువాత మానేయాలంటే మానేయవచ్చు.
Also read: Post Office Scheme: అద్భుత లాభాల్ని ఆర్జించే పోస్టాఫీసు పథకాలు, పదేళ్లలో 16 లక్షల రూపాయలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook