LPG Cylinder Price: గ్యాస్ సిలెండర్ ధర కేవలం 750 రూపాయలే, వెంటనే బుక్ చేసి లబ్ది పొందండి..
LPG Cylinder Price: ఎల్బీజీ గ్యాస్ సిలెండర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో కేవలం 750 రూపాయలకే గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. అదెలాగో చూద్దాం..
LPG Cylinder Price: ఎల్బీజీ గ్యాస్ సిలెండర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో కేవలం 750 రూపాయలకే గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. అదెలాగో చూద్దాం..
గ్యాస్ సిలెండర్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అప్పుడే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర వేయి రూపాయలు దాటేసింది. ఈ క్రమంలో తక్కువ ధరకే సిలెండర్ కొనుగోలు చేసే అవకాశం కలుగుతోంది. గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనే ఆలోచన ఉంటే..ఈ సౌలభ్యం మీకు వర్తిస్తుంది. కేవలం 750 రూపాయలకే గ్యాస్ సిలెండర్ పొందవచ్చు. ఇండియన్ గ్యాస్ ఈ సౌలభ్యాన్ని అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
ప్రస్తుతం దేశంలో గ్యాస్ సిలెండర్ ధర భారీగా పెరిగిపోయింది. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర 1053 రూపాయలకు చేరుకుంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థ ఇండేన్ గ్యాస్ సిలెండర్‌ను 750 రూపాయలకే అందిస్తోంది. ఏ విధంగా ఈ ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుందాం..
ఇండేన్ గ్యాస్ వినియోగదారుల కోసం కాంపోజిట్ సిలెండర్ సౌకర్యం ప్రారంభమైంది. ఈ సిలెండర్‌ను మీరు కేవలం 750 రూపాయలకే పొందవచ్చు. ఈ సిలెండర్ ప్రత్యేకత ఏంటంటే..సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ కూడా చేసుకోవచ్చు. కాంపాజిట్ సిలెండర్ ధర మిగిలిన సిలెండర్లతో పోలిస్తే బరువు కూడా తక్కువ. ఇందులో 10 కిలోల గ్యాస్ లభిస్తుంది. అందుకే ధర కూడా తక్కువే. ఈ సిలెండర్ మరో ప్రత్యేకత ట్రాన్స్‌పరెంట్ కావడం. ప్రస్తుతం ఈ సిలెండర్ 28కి పైగా నగరాల్లో అందుబాటులో ఉంది. త్వరలోనే దేశంలోని అన్ని నగరాలకు అందనుంది.
కాంపోజిట్ సిలెండర్ కొత్త ధరలు
ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర 750 రూపాయలు కాగా, కోల్‌కతాలో 765 రూపాయలుగా ఉంది. అటు చెన్నైలో 761 రూపాయలైతే..లక్నోలో 777 రూపాయలుగా ఉంది. అటు 14.2 కిలోల సిలెండర్ ధర ఢిల్లీలో 1053 రూపాయలు కాగా, ముంబైలో 1052.5 రూపాయలుగా ఉంది. చెన్నైలో 1068.5 రూపాయలుగా ఉంటే..కోల్‌కతాలో 1079 రూపాయలుంది. ఇక లక్నోలో 1090.5 రూపాయలుంది.
Also read: Todays Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ ఆగస్టు 24న బంగారం ధరలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook