Dussehra 2022: దసరా పండుగ ఎప్పుడు, విజయ దశమి మహత్యం, శుభ ముహూర్తం, తిధి వేళలేంటి

Dussehra 2022: హిందూవులకు ముఖ్యంగా దక్షిణాదికి అత్యంత ముఖ్యమైన పండుగ దసరా. ఈ ఏడాది దసరా ఎప్పుడు, శుభ ముహూర్తం, తిధి వేళలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 23, 2022, 10:09 PM IST
Dussehra 2022: దసరా పండుగ ఎప్పుడు, విజయ దశమి మహత్యం, శుభ ముహూర్తం, తిధి వేళలేంటి

Dussehra 2022: హిందూవులకు ముఖ్యంగా దక్షిణాదికి అత్యంత ముఖ్యమైన పండుగ దసరా. ఈ ఏడాది దసరా ఎప్పుడు, శుభ ముహూర్తం, తిధి వేళలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

హిందూమత పంచాంగం ప్రకారం దసరా అతి ముఖ్యమైన పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా..ప్రతి యేటా అశ్విని మాసంలోని శుక్లపక్షం దశమతిధి నాడు దసరా జరుపుకుంటారు. ఇదే విజయ దశమి. ఈ రోజునే శ్రీ రాముడు..రావణ సంహారం చేసి భూ మండలాన్ని రావణుడి ప్రకోపం నుంచి కాపాడుతాడని అంటారు. ఈ రోజున శ్రీ రాముడిని పూజించి..రావణుడి బొమ్మను దహనం చేయడం ఓ ఆనవాయితీ. దేశమంతా ఇదే జరుపుతారు. 

ఈ ఏడాది దసరా ఎప్పుడు

దసరా పండుగ ప్రతియేటా దీపావళికి 20 రోజుల ముందు వస్తుంది. ఈ ఏడాది దసరా అక్టోబర్ 5న ఉంది. అంటే అక్టోబర్ 5 కంటే 9 రోజుల ముందు నుంచి దుర్గాదేవి నవరాత్రులు నిర్వహిస్తారు. 

విజయ దశమి శుభ ముహూర్తం ఎప్పుడు

అశ్విని మాసంలోని శుక్లపక్షం దశమి తిధి అక్టోబర్ 4 మద్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై..అక్టోబర్ 5 మద్యాహ్నం 12 గంటల వరకూ ఉంటుంది. అక్టోబర్ 5 మద్యాహ్నం 2 గంటల 13 నిమిషాల్నించి 3 గంటల వరకూ విజయదశమి పూజా ముహూర్తమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

దసరా మహత్యం

దసరా రోజునే శ్రీరాముడు..అహంకారైన రావణుడిని హతమారుస్తాడు. ఈ ఆనందంలోనే శ్రీరాముడిని దసరా రోజున పూజిస్తారు. ఈ రోజు శ్రీరాముడి నామజపంతో భక్తుల కష్టాలు దూరమౌతాయి. పౌరాణిక గ్రంధాల ప్రకారం..దసరా నాడు ఆయుధ పూజ ప్రధానంగా జరుగుతుంది. దసరా పండుగ దేశంలో అత్యంత ఘనంగా జరిగేది దక్షిణాదిలోనే కావడం విశేషం. దక్షిణాది పెద్ద పండుగల్లో ఒకటి విజయ దశమి. దక్షిణాదిలో కర్ణాటక రాష్ట్రంలో జరిగే దసరా వేడుకలు అద్భుతంగా ఉంటాయి.

Also read: Lucky Gemstones: సింహరాశి జాతకులు ఏ రత్నం ధరిస్తే అత్యంత ప్రయోజనకరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News