LPG Gas Price Hike: భారీగా పెరిగిన LPG గ్యాస్ ధర.. సిలిండర్ పై రూ.250 పెంపు!
LPG Gas Price Hike: మరోసారి LPG గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. కమర్షియల్ సిలిండర్ పై రూ. 250 మేరకు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,460కు చేరింది.
LPG Gas Price Hike: దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పై రూ. 250 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. మరోవైపు డొమెస్టిక్ సిలిండర్ (గృహాల్లో వినియోగించే నాన్ కమర్షియల్ సిలిండర్ 14.2 కిలోలు) ధరలో ఎలాంటి మార్పు లేదు. దాని ధర సబ్సిడీ లేకుండా రూ. 1,002 ఉండగా.. సబ్సిడీ సిలిండర్ ధర రూ. 952గా కొనసాగుతోంది.
దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,186 నుంచి రూ. 2,460 వద్దకు చేరుకుంది. పెరిగిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ పై 10 రోజుల కిందట అంటే మార్చి 22న భారాన్ని మోపగా.. అప్పుడు కమర్షియల్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడా కమర్షియల్ సిలిండర్ ధరను చమురు సంస్థలు పెంచేశాయి.
డొమెస్టిక్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 950, కోల్ కతాలో రూ.976, ఆర్థిక రాజధాని ముంబయిలో రూ.949, చెన్నైలో రూ.965 కు చేరింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధరలు రూ. 1,000కి పైగా చేరుకున్నాయి.
Also Read: Petrol Price Hiked: మరోసారి భారీగా పెరిగిన ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ పై ఎంత భారం?
Also Read: Whatsapp Update 2022: ఇకపై ఆ ఆండ్రాయిడ్, IOS స్మార్ట్ ఫోన్స్ లో వాట్సాప్ పనిచేయదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook