Whatsapp Update 2022: ఇకపై ఆ ఆండ్రాయిడ్, IOS స్మార్ట్ ఫోన్స్ లో వాట్సాప్ పనిచేయదు!

Whatsapp Update 2022: వరల్డ్ వైడ్ గా ఎంతో ప్రాముఖ్యం పొందిన వాట్సాప్ మెసేంజర్ యాప్ ఇకపై కొన్ని స్మార్ట్ ఫోన్స్ లో పనిచేయదు. ప్రముఖ కంపెనీలకు చెందిన కొన్ని పాత మోడళ్లలో ఇకపై వాట్సాప్ సేవలను నిలిపేస్తున్నామని యాజమాన్య సంస్థ మెటా ప్రకటించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 07:48 AM IST
Whatsapp Update 2022: ఇకపై ఆ ఆండ్రాయిడ్, IOS స్మార్ట్ ఫోన్స్ లో వాట్సాప్ పనిచేయదు!

Whatsapp Update 2022: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నెటిజన్లు వాడే మెసేంజర్స్ యాప్స్ లో వాట్సాప్ ఒకటి. మార్కెట్లోకి వచ్చే కొత్త స్మార్ట్ ఫోన్స్ ఆధారంగా ఈ వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు తమ సేవల్ని విస్తరిస్తుంది. మరోవైపు పాత మోడల్ మొబైల్స్ లో ఈ యాప్ పనిచేయకుండా చేస్తుంది. ఇకపై కొన్ని స్మార్ట్ ఫోన్స్ లో ఈ యాప్ పనిచేయదని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఓ ప్రకటనలో తెలియజేసింది. 

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, కాయ్‌ వంటి ఆపరేటింగ్ సిస్టమ్ లోని కొన్ని వెర్షన్‌లు కలిగిన స్మార్ట్ ఫోన్స్ లో వాట్సాప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. మార్చి 31 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న ఆయా మొబైల్ మోడల్స్ జాబితాను మెటా విడుదల చేసింది. 

ఆండ్రాయిడ్ 4.0 లేదా అంతకంటే తక్కువ వర్షెన్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన స్మార్ట్ ఫోన్ లో ఇకపై వాట్సాప్ పనిచేయదు. అంతే కాకుండా IOS 10 లేదా అంతకంటే తక్కువ మోడల్స్ వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. కాయ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా 2.5 వర్షెన్ కంటే తక్కువగా ఉన్న మోడళ్లలోనూ వాట్సాప్ ఆగిపోనుంది. అయితే భారత్ లో వాడే ఏఏ మొబైల్స్ లో వాట్సాప్ పనిచేయదో ఆ జాబితా వివరాలను తెలుసుకుందాం. 

Samsung 

శాంసంగ్‌ కంపెనీ నుంచి గతంలో విడుదలైన గెలాక్సీ ట్రెండ్‌ లైట్‌, గెలాక్సీ ఎస్3 మినీ, గెలాక్సీ ఎక్స్‌కవర్‌ 2, గెలాక్సీ కోర్‌ వంటి మొబైల్ మోడల్స్ లో మార్చి 31 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. 

Xiaomi

Xiaomi కంపెనీ తీసుకొచ్చిన హంగ్ఎంఐ, mi2A, Redmi Note 4G, HungMG 1S  వంటి మోడళ్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు. 

LG స్మార్ట్ ఫోన్స్

LG కంపెనీకి చెందిన సిరీస్ లో ఎఫ్‌3, ఎఫ్5, ఎఫ్‌6, ఎఫ్‌7, ఆప్టిమస్‌ ఎల్‌3 II డ్యూయల్‌, ఎల్‌4 II డ్యూయల్, ఆప్టిమస్‌ ఎల్ II, ఎఫ్‌5 II, ఎఫ్‌5 II డ్యూయల్‌, ఎఫ్‌7 II, ఎఫ్‌7 II డ్యూయల్‌, ఎల్‌జీ ఎన్‌ఆక్ట్‌, ఆప్టిమస్‌ ఎల్‌2 II, ఆప్టిమస్‌ ఎఫ్‌3క్యూ మోడల్స్‌లో ఇకపై వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి. 

Huawei

Huawei కంపెనీ గతంలో విడుదల చేసిన అసెండ్‌ డీ, క్వాడ్‌ XL, అసెండ్‌ D1, అసెండ్‌ P1 S లాంటి మోడళ్లలోనూ వాట్సాప్‌ పనిచేయదు. 

Motorola (Moto)

మోటోరోలాకు చెందిన డ్రాయిడ్ రాజర్ మోడల్స్ అమ్మకాలను ఆపేశారు. అయినా, ఈ మోడల్స్ ఇంకా వాడుతున్నట్లయితే వారి మొబైల్స్ ఇకపై వాట్సాప్ సేవలు బంద్ కానున్నాయని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ప్రకటించింది.   

ALso Read: DA Hike: ఉద్యోగులకు గుడ్​ న్యూస్​- మరో 3 శాతం పెరిగిన డీఏ!

Also Read: Petrol price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు- హైదరాబాద్​లో సెంచరీ కొట్టిన డీజిల్​..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News