Gas Cylinder Price Today: వంట గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్. సిలిండర్ ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిలిండర్‌పై రూ.200 వరకు తగ్గించేలా కేంద్రం ఆలోచిస్తుండగా.. త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంటి అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.1160 వరకు ఉండగా.. కమర్షియల్ గ్యాస్ ధర రూ.1620గా ఉంది. ప్రతి నెల ప్రారంభంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ వంట గ్యాస్ రేట్లపై నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆగస్టు 1వ తేదీన కమర్షియల్ సిలిండర్ ధరలను 99.75 రూపాయల తగ్గించింది. ఈ నేపథ్యంలో ఈసారి గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డొమస్టిక్ గ్యాస్ సిలిండర్లపై ఈ ఏడాది మార్చి 1వ నుంచి ఎలాంటి మార్పు చేయలేదు. జూలైలో చమురు కంపెనీలు దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ.50 పెంచాయి. మేలో రెండుసార్లు పెంపుదల జరిగింది. సబ్సిడీ లేని డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు వరుసగా ఢిల్లీ రూ.1,103, కోల్‌కతా రూ.1,129, ముంబై రూ.1,102.50, చెన్నై రూ.1,118.50, హైదరాబాద్‌లో 1155 రూపాయలుగా ఉంది. ప్రతి నెల ఒకటో తేదీన ఓఎమ్‌సీలులు ఎల్‌పీజీ ధరలను సర్దుబాటు చేస్తాయి. అయితే లోకల్ ట్యాక్స్‌లు, నిబంధనల కారణంగా ఆయా రాష్ట్రాల్లో ధరలు వేరుగా ఉంటాయి.


డొమెస్టిక్ సిలిండర్లు ధరలు తగ్గిస్తారని ముందు నుంచే అంచనా ఉంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గ్యాస్ ధరలు తగ్గుతాయని అంచనాలు ఉండగా.. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ ధరలు ప్రస్తుతం ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రిటైల్ విక్రయ ధర రూ.1,680, కోల్‌కతా రూ.1,802, ముంబై రూ.1,640, చెన్నై రూ.1,852.50, హైదరాబాద్‌ 1,918.00 రూపాయలుగా ఉన్నాయి.  అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దేశీయ ఎల్‌పీజీ ధరలపై ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే.


లేటెస్ట్ అప్‌డేట్‌


కేంద్రం దేశంలోని మహిళలకు రాఖీ పౌర్ణమి కానుక ప్రకటించింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించింది. అటు ఉజ్వల లబ్ధిదారులకు ఇప్పటికే రూ.200 తగ్గింపు ధరకు సిలిండర్ అందుతుండగా.. తాజా నిర్ణయంతో వారికి రూ.400 తగ్గింపు వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో దేశంలోని 33 కోట్ల మంది వినియోగదారులకు లాభం కలుగుతుంది. ఈ ప్రయోజనం తక్షణం అమల్లోకి వస్తుందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక.. రెండు రోజుల్లో డీఏపై పెంపుపై క్లారిటీ..!  


Also Read: Asia Cup 2023: సచిన్ రికార్డుపై రోహిత్ శర్మ కన్ను.. టాప్ ప్లేస్‌కు చేరవలో..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook