Rohit Sharma Records: ఆసియా కప్‌కు సర్వ సిద్ధమైంది. రేపు పాకిస్థాన్, నేపాల్ జట్ల మధ్య పోరుతో వేట ప్రారంభంకానుంది. సెప్టెంబరు 2న పాకిస్థాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వరల్డ్ కప్ సన్నాహాకంగా ఈ టోర్నీని వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. భారత్, పాక్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆసియాకప్‌లో పాల్గొంటున్నాయి. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ పేరిట రికార్డు ఉంది. 23 మ్యాచ్‌లు ఆడి 971 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడు. 22 మ్యాచ్‌ల్లో 745 పరుగులు చేశాడు. రోహిత్ టాప్ ప్లేస్‌కు చేరాలంటే 226 పరుగులు చేయాలి. ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు చేశాడు.
ఓవరాల్‌గా ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య మొదటి స్థానంలో ఉన్నాడు. 25 మ్యాచ్‌లు ఆడిన ఈ డాషింగ్ ఓపెనర్ 1220 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కుమార సంగక్కర రెండో స్థానంలో నిలిచాడు. 24 మ్యాచ్‌ల్లో 1075 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. సచిన్ మూడు, షోయబ్ మాలిక్ (786) నాలుగో స్థానంలో ఉన్నారు.
ఆసియా కప్‌లో మొదట గ్రూప్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. తరువాత సూపర్ ఫోర్ మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్ 17న కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీస్‌లో తొలి మ్యాచ్ మినహా.. మిగిలిన అన్ని మ్యాచ్‌లు కొలంబోలోనే జగనున్నాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆడనున్న భారత్.. రెండో మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది.
Also Read: Central Govt Schemes: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ స్కీమ్ కింద అతి తక్కువ వడ్డీకే లోన్లు..!
Also Read: Minister Roja: రజనీకాంత్ స్టైల్లో మంత్రి రోజా డైలాగ్.. పవన్, చంద్రబాబుకు కౌంటర్.. అర్థమైందా రాజా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook