Mahindra Hyper Car: ప్రముఖ కార్ల కంపెనీ మహీంద్రా మరో సంచలానికి తెరలేపింది. త్వరలో హైపర్ కారు తయారీపై ఫోకస్ పెట్టింది. ఆసియాలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్ని తలదన్నేలా తీర్దిదిద్దుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రాక్టర్ల నుంచి ఎస్‌యూవీ కార్ల వరకూ సాగిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్ర(Mahindra)మరో కొత్త సంచలనానికి తెరలేపింది. సరికొత్త హైపర్ కారును ప్రవేశపెట్టబోతోంది. ఆసియాలోని ఆటోమొబైల్ కంపెనీల కార్లను తలదన్నేలా కొత్తకారుపై దృష్టి సారించింది. ఆటోమొబైల్ మార్కెట్‌లో పట్టు పెంచుకోవడంతో పాటు బ్రాండ్ ఇమేజ్‌ని విస్తరించే పనిలో పడింది మహీంద్రా. హై ఎండ్ లగ్జరీ కార్ల సెగ్మెంట్‌లో రెనాల్ట్, ఫోర్డ్‌లతో కలిసి ముందుకెళ్లేందుకు ఇప్పటికే నిర్ణయించింది. హైపర్ కార్ల తయారీలో సుప్రసిద్ధమైన పినిన్‌ఫరినాతో కలిసేందుకు మహీంద్రా సిద్ధమైందని బ్లూమ్‌బర్ల్ మీడియా ప్రచురించింది. రానున్న రెండేళ్లలో మహీంద్రా, పినిన్‌ఫరినా సంస్థలు సంయుక్తంగా హైపర్ కారుని మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నాయి.


2019లో జెనీవాలో(Geneva) జరిగిన ఆటో ఎక్స్‌ప్లో‌లో పినిన్‌ఫరినా తొలిసారిగా హైపర్ కారును ప్రదర్శించింది. 2020లో మార్కెట్‌లో తీసుకొస్తామని ప్రకటించినా..కరోనా పరిస్థితుల కారణంగా ఆ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. 2022 ప్రారంభంలో తిరిగి ఈ హైపర్ కారును ప్రవేశపెట్టేందుకు ఆ సంస్థ యోచిస్తోంది. ఇటు మహీంద్రా సంస్థ ఈ కారు తయారీలో భాగస్వామ్యం కావాలని ప్రయత్నిస్తోంది. అన్నీ అనుకూలిస్తే మహీంద్ర - పినిన్‌ఫరినా ఆధ్వర్యంలో రానున్న హైపర్ కారుని(Hyper Car)పూర్తిగా ఎలక్ట్రిక్ కారుగా తీసుకురానున్నారు. ఈ కారు గరిష్టవేగం గంటకు 350 కిలోమీటర్లు కాగా, ఒకసారి ఛార్జ్ చేస్తే 5 వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. మహీంద్ర-పినిన్‌ఫరినా(Pininfarina)హైపర్ కారు ధర 2.3 మిలియన్ డాలర్లుగా ఉండవచ్చని అంచనా. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి 5 బుకింగ్స్ పూర్తయ్యాయి.


Also read: Supreme Court: దేశంలోని ప్రధాన హైకోర్టులో మరో 16 మంది న్యాయమూర్తుల నియామకం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook