Mahindra hiked Thar RWD prices by Rs 50000: ప్రముఖ కార్ల తయారీదారు 'మహీంద్రా' 2023 జనవరిలో భారత దేశంలో థార్ లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ యొక్క రియర్-వీల్-డ్రైవ్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ 3 వేరియంట్‌లలో (AX డీజిల్, LX డీజిల్ మరియు LX పెట్రోల్) విడుదల అయింది. ఈ కారు ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.49 లక్షల మధ్య ఉంది. ఈ ధరలు మొదటి 10,000 కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. అయితే మహీంద్రా కంపెనీ ఇప్పుడు థార్ డీజిల్ మాన్యువల్ (Mahindra Thar LX Diesel Manual) వేరియంట్ ధరను రూ.50000 పెంచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహీంద్రా థార్ డీజిల్ మాన్యువల్ వేరియంట్ ధర (Mahindra Thar Price Hike 2023) ఇప్పుడు రూ. 11.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరిగింది. ఈ వేరియంట్ ధర ఇదివరకు రూ.10.99 లక్షలుగా ఉంది. బేస్ డీజిల్ AX(O) మరియు LX పెట్రోల్ AT ధరలు మునుపటిలానే ఉన్నాయి. ఈ మోడల్ హార్డ్‌టాప్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.  AX (O) డీజిల్ వేరియంట్ రూ. 9.99 లక్షలు,  LX డీజిల్ రూ. 11.49 లక్షలు (గతంలో రూ. 10.99 లక్షలు),  LX పెట్రోల్ AT  రూ. 13.49 లక్షలుగా ఉన్నాయి. 


మహీంద్రా థార్ RWD వెర్షన్ ఎవరెస్ట్ వైట్ మరియు బ్లేజింగ్ బ్రాంజ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. థార్ RWD ధర 4×4 వెర్షన్ కంటే దాదాపు రూ. 4 లక్షలు తక్కువ. మహీంద్రా థార్ RWD వెర్షన్ 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. 4X4 వెర్షన్ 2.2L ఇంజన్‌ను కలిగి ఉంటుంది. డీజిల్ ఇంజిన్ థార్ RWDని సబ్-4 మీటర్ల వాహనాలపై GST ప్రయోజనాల పరిధిలోకి తీసుకువస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 117bhp పవర్ మరియు 300Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.


మహీంద్రా థార్ టర్బో పెట్రోల్ RWD వేరియంట్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. 2L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 150PS మరియు 320Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. థార్ RWD పవర్డ్ ORVMలు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఆల్-టెర్రైన్ టైర్‌లతో కూడిన 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.


Also Read: Tata Nexon Price 2023: కేవలం 6 లక్షలకే టాటా నెక్సాన్‌.. నో వెయిటింగ్ పీరియడ్! రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఇంటికి తీసుకెళ్లండి  


Aslo Read: iPhone 13 Price: హోలీ 2023 బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా తగ్గిన ఐఫోన్ 13 ధర! ఆఫర్ మూడు రోజులే  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.