Mahindra XUV400 EV Price, Single Charge Range, Features: మహింద్రా ఆటోమొబైల్స్ నుంచి మరో కొత్త బాహుబలి లాంటి మహింద్రా SUV XUV 400 EV లాంచ్ అయింది. సోమవారమే ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవి వాహనం బేసిక్ వేరియంట్ ధర రూ. 15.99 లక్షలుగా ఉండగా.. హై ఎండ్ వేరియంట్ ధర రూ. 18.99 లక్షలుగా ఉంది. మహింద్రా SUV XUV 400 ఈవీ లాంచింగ్ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. మార్కెట్లోకి లాంచ్ అయిన తొలి ఏడాదిలోనే 20 వేల యూనిట్స్ ని డెలివరీ చేస్తామని ధీమా వ్యక్తంచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహింద్రా ఎక్స్‌యూవీ 400 ధర:
మహింద్రా ఎక్స్‌యూవీ 400 బేసిక్ వేరియంట్ ధర రూ. 15.99 లక్షలుగా ఉండగా.. హై ఎండ్ వేరియంట్ ధర రూ. 18.99 లక్షలుగా ఉంది. అయితే, ఈ ధర తొలి 5 వేల వాహనాల బుకింగ్స్ వరకే వర్తిస్తుందని మహింద్రా ఆటోమొబైల్స్ కంపెనీ ప్రతినిధులు స్పష్టంచేశారు. 


మహింద్రా ఎక్స్‌యూవీ 400 బుకింగ్స్ ప్రారంభ తేదీ
వాస్తవానికి గతేడాది సెప్టెంబర్‌లోనే మహింద్రా కంపెనీ ఈ వాహనాన్ని ఆవిష్కరించినప్పటికీ.. ఈ ఏడాది జనవరి 16 నే మార్కెట్‌లోకి లాంచ్ అయింది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26 నుంచి మహింద్రా ఎక్స్‌యూవీ 400 వాహనం బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈఎల్ వేరియంట్ వాహనాలు మార్చి 2023 నుంచే డెలివరీ కానుండగా.. ఈసి వేరియంట్ వాహనాలు మాత్రం ఈ ఏడాది దీపావళి పండగ కానుకగా డెలివరి కానున్నాయి. 


8.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ పికప్
మహింద్రా ఎక్స్‌యువి 400 ఎలక్ట్రిక్ కారు ఇంజన్ పికప్ సామర్థ్యం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. యాక్సిలరేట్ అయిన తొలి 8.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలిగే కెపాసిటీ ఈ కారు సొంతం. 


50 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్
చార్జింగ్ మొదలుపెట్టిన 50 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ రీచార్జ్ అయ్యేంత స్పీడ్ చార్జింగ్ సౌకర్యం కలదు. అత్యవసర సమయంలో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. 


మహింద్రా ఎక్స్‌యువి 400 ఈసి వేరియంట్:
మహింద్రా ఎక్స్‌యువి 400 ఈసి వేరియంట్ లో 34.5 kWh బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే.. 375 కిమీ రేంజ్ ఇస్తుంది. ఈ వేరియంట్ లో రెండు రకాల చార్జింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది 3.3 kW రకం కాగా దీని ఖరీదు రూ. 15.99 లక్షలుగా ఉంది. అలాగే 7.2 kW చార్జింగ్ వేరియంట్ ధర రూ. 16.49 లక్షలుగా ఉంది.


మహింద్రా ఎక్స్‌యువి 400 ఈఎల్ వేరియంట్:
మహింద్రా ఎక్స్‌యువి 400 ఈసి వేరియంట్ లో 39.4 kWh బ్యాటరీని అమర్చారు. ఇది 456 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ వేరియంట్ 7.2 kW చార్జర్ తో వస్తోంది. ఈ మోడల్ ఖరీదు రూ. 18.99 లక్షలుగా నిర్ణయించారు.


ఇది కూడా చదవండి : Salary Hikes in 2023: జీతాల పెంపుపై ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్


ఇది కూడా చదవండి : Govt Employees Basic Salary: ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్ 2023 తరువాత సూపర్ గుడ్ న్యూస్ ?


ఇది కూడా చదవండి : Tata Punch, Baleno: మార్కెట్లోకి కొత్త కారు ఎంట్రీ.. ఇప్పుడు టాటా పంచ్, బలెనో పరిస్థితి ఏంటి ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook