Mahindra XUV700: 57 నిమిషాల్లో 25,000 బుకింగ్‌లు..మహీంద్రా ఎక్స్‌యూవీ 700 క్రేజ్ మామూలుగా లేదుగా..!
Mahindra XUV700: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌యూవీ 700 కారుకు మంచి క్రేజ్ లభిస్తోంది. కేవలం 57 నిమిషాల్లోనే 25 వేల ఆర్డర్లు అందుకున్న తొలి కార్ మోడల్‌గా ఎక్స్‌యూవీ 700 ఘనత సాధించింది.
Mahindra XUV700: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ కారు ఎక్స్‌యూవీ 700(Mahindra XUV700)కు భారీ స్పందన లభిస్తోంది. ఈ కారు బుకింగ్స్(Bookings)ను గురువారం ప్రారంభించగా హాట్‌కేకుల్లా బుక్ అయ్యాయి. కేవలం 57 నిమిషాల్లోనే 25వేల బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
బాధ్యత పెరిగింది: ఆనంద్ మహీంద్రా
'ఎక్స్‌యూవీ 700 కోసం ఈ ఉదయం 10 గంటలకు బుకింగ్స్ తెరిచాం. 57 నిమిషాల్లోనే 25వేల మంది ఈ కారును బుక్ చేసుకున్నారు. ఈ కారుకు వచ్చిన స్పందన చూసి ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది'’ అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈవో విజయ్ నక్రా తెలిపారు. అటు సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) కూడా ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. కస్టమర్లకు తమ సంస్థపై ఎంత నమ్మకం ఉందో, తమ భుజాలపై ఎంత బాధ్యత ఉందో దీన్ని చూస్తుంటే అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.
తొమ్మిది వేరియంట్స్ లో లభ్యం
సెప్టెంబరు నెలాఖరులో ఎక్స్‌యూవీ 700 కారును విడుదల చేశారు. దీని ప్రారంభ వేరియంట్(ఎక్స్‌షోరూం) ధర రూ.11.99 లక్షలుగా.. టాప్ వేరియంట్ ధర రూ.21.09లక్షలుగా నిర్ణయించారు. దీనిని పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో తొమ్మది వేరియంట్లల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆల్‌వీల్ డ్రైవ్ ఫీచర్ కూడా ఉంది. ఐదు, ఏడు సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది.
తదుపరి బుకింగ్స్ ఎప్పుడంటే..
తదుపరి బుకింగ్ ప్రక్రియ(Next Booking process) కొత్త ధరలతో శుక్రవారం (అక్టోబర్ 8) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. శుక్రవారం నుంచి ఎక్స్‌యూవీ 700 ధర (దిల్లీ ఎక్స్ షోరూం) రూ.12.49 లక్షల నుంచి రూ.22.99 లక్షల మధ్య ధరకు బుకింగ్స్‌కు అందుబాటులో ఉండనుంది. బుకింగ్స్‌కు ఈ స్థాయి స్పందన వస్తుందని ముందే ఊహించి అదనపు సర్వర్లను సిద్ధం చేసినప్పటికీ.. కొంత మంది యూజర్లు బుకింగ్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఎం&ఎం సీఈఓ విజయ్ నక్రా(Vijay Nakra) తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook