Mark Zuckerberg : పక్కకెళ్లీ ఆడుకో తమ్ముడు.. మస్క్‌కు మార్క్ షాక్.. దెబ్బకు టాప్‌లోకి వచ్చాడుగా..!
Mark Zuckerberg World`s Second Richest Man: మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్..ఎలాన్ మస్క్ కు సవాల్ విసిరాడు. ఎలాన్ మస్క్ నెట్టేసి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ నుంచి ఈ క్రెడిట్ ను కైవసం చేసుకున్నాడు.
Mark Zuckerberg World's Second Richest Man: మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అతను అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్‌ను కిందికి నెట్టేశాడు. కాగా మార్క్ జుకర్‌బర్గ్ నికర విలువ $206.6 బిలియన్లకు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసిందిన. ఈ జాబితాలో మార్క్ జుకర్ బర్గ్ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచినట్లుగా పేర్కొంది. జెఫ్ బెజోస్ 205.1 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. అయితే నెంబర్ వన్ జాబితాలో టెస్లా సీఈవో ఎలోన్ మాస్క్ పేరు ఉంది. మార్క్ జుకర్ బర్గ్ ఎలోన్ మస్క్ కంటే కేవలం 50 బిలియన్ డాలర్ల మాత్రమే తక్కువగా ఉన్నాడు. ఈ జాబితా ప్రకారం త్వరలోనే మస్క్ స్థానాన్ని జుకర్ బర్గ్ కైవసం చేసుకోవడం పక్కా అని పలు నివేదికలు చెబుతున్నాయి.
అయితే మార్క్ జుకర్ బర్గ్ సడెన్ గా నెంబర్ 2కి ఎలా ఎగబాకాడు అనేది అందరిలోనూ కలుగుతున్న సందేహం. దీని వెనక అతని కంపెనీ మెన్లో పార్గ్ అద్బుతమైన లాభాలను తెచ్చిపెట్టింది. మార్క్ జుకర్ బర్గ్ 13శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈ ఏడాది మెన్లో పార్క్ మంచి లాభాలను ఆర్జించింది. దీని ప్రకారం మార్క్ జుకర్ బర్గ్ నికర విలువ అమాంతం పెరిగింది. ప్రస్తుతం జుకర్ బర్గ్ నికర విలువ 2024 ఏడాదిలో 78 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది.
మెన్లో పార్క్‌తో పాటు, మెటా షేర్లు కూడా ఈ ఏడాది విపరీతమైన బూమ్‌ను నమోదు చేశాయి. మెటా షేర్లు దాదాపు 70 శాతం పెరిగాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో పెట్టుబడి పెట్టడం వల్ల మెటాకు మంచి లాభాలు వస్తున్నాయి. మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీలో దాదాపు 21,000 మంది ఉద్యోగులు ఉన్నారు. మార్క్ జుకర్‌బర్గ్ మెటాను అభివృద్ధి చేయడానికి వర్చువల్ టెక్నాలజీపై బిలియన్ల డాలర్లను కూడా ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ జాబితాలో ఎలోన్ మస్క్ పేరు నంబర్ వన్, మార్క్ జుకర్‌బర్గ్ రెండో స్థానంలో, జెఫ్ బెజోస్ మూడో స్థానంలో నిలిచారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్, లారీ ఇల్లిజ్న్, బిల్ గేట్స్, లారీ పేజ్, స్టీవ్ బాల్మెర్, వారెన్ బఫెట్, సెర్గీ బ్రిన్ టాప్ 10 సంపన్నుల జాబితాలో ఉన్నారు.
Also Read: PM Kisan Yojana: రేపే రైతుల ఖాతాల్లో రూ.2000 జమా.. కేవైసీ పూర్తి చేశారా? హెల్ప్‌లైన్ నంబర్స్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.