Best Mileage CNG Car- Maruti Celerio: ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే.. పెట్రోల్ - డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక ఇపుడు ఉన్న పరిస్థితుల్లో కారు మెయింటనెన్స్ తగ్గించాలంటే ఉన్న ఏకైక మార్గం కారు మైలేజీ పెంచటం. పెట్రోల్ కంటే డీజిల్ కార్లు మైలజీ ఎక్కువే మరియు పెట్రోల్ తో పోలిస్తే డీజీల్ ధర తక్కువే! కానీ  CNG కార్లు పెట్రోల్ మరియు డీజిల్ కార్లు రెండింటి కంటే ఎక్కువ మైలేజీని ఇస్తాయి మరియు CNG కూడా రెండింటి కంటే తక్కువ ధరలో ఉంటుంది. అంతేకాక CNG కార్ల రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మైలేజీనిచ్చే సీఎన్‌జీ కారును తీసుకోవటమే మంచి ఆలోచన అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీకి అలాంటి కారే ఉంది. మారుతి సుజుకి సెలెరియో దేశంలోనే CNGలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు. ఈ కారు కిలోగ్రాముకు CNG గ్యాస్ కి 35.6 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో CNG గ్యాస్ ధర రూ. 95.. అంటే హైదరాబాద్ లో రూ. 3 కే ఒక కిలోమీటర్ వరకు వెళ్లొచ్చని అర్థం. 


కారు ధర.. 


Also Read:  SA vs ENG: చెలరేగిన సఫారీ బ్యాటర్లు.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం..


మారుతి సెలెరియో ధరలు రూ. 5.37 లక్షల నుంచి ప్రారంభమై రూ. 7.14 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. దీని CNG వేరియంట్ ధర రూ. 6.74 లక్షలు (ఎక్స్-షోరూమ్) అయితే ఈ నెల (అక్టోబర్ 2023) దాని CNG వేరియంట్ రూ. 68,000 వరకు తగ్గింపును అందిస్తుంది. అయితే డీలర్‌షిప్ మరియు లొకేషన్‌ను బట్టి తగ్గింపు మారవచ్చు. 


ఇంజిన్ & ఫీచర్లు.. 
ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. దీనితో, 5-స్పీడ్ మాన్యువల్ (స్టాండర్డ్) మరియు 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి. సెలెరియో CNGలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, పాసివ్ కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.


Also Read: Volvo Car India: లగ్జరీ కార్లకు పెరుగుతున్న క్రేజ్, 40 శాతం వృద్ధి సాధించిన వోల్వో



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..