Maruti Cars Discount Offers : కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి మారుతి సుజుకి కార్ల కంపెని గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ. 46 వేల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నట్టు మారుతి సుజుకి స్పష్టంచేసింది. ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్స్, క్యాష్ డిస్కౌంట్స్ ఆఫర్స్ కింద కస్టమర్స్ ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆల్టో 800, ఆల్టో K10, వాగన్ ఆర్, ఎస్ ప్రెస్సో, స్విఫ్ట్, డిజైర్, సెలెరియో వంటి కార్లపై ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సోపై రూ. 46 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్
మారుతి ఎస్ ప్రెస్సో ఎంటి వేరియంట్స్‌పై రూ. 25 వేలు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఎక్స్‌చేంజ్ బోనస్ కింద మరో రూ. 15 వేలు ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ. 6 వేలు కలిపి మొత్తం రూ. 46 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అలాగే ఏఎంటి వేరియంట్స్‌పై రూ. 21 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.


మారుతి ఎస్ ప్రెస్సోలో సీఎన్జీ వేరియంట్స్‌పై రూ. 43,100 వరకు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇందులో రూ. 25 వేలు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ కాగా ఎక్స్‌చేంజ్ బోనస్ కింద మరో రూ. 15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ. 3,100.. కలిపి మొత్తం రూ. 43,100 వరకు డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.


మారుతి సుజుకి ఆల్టో K10 పై రూ. 37,000 వరకు డిస్కౌంట్
మారుతి సుజుకి ఆల్టో 800 కార్లలో పెట్రోల్ ఎంటీ, సీఎన్జీ వేరియంట్స్‌పై రూ. 37 వేల వరకు డిస్కౌంట్స్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 15,000 కాగా ఎక్స్‌చేంజ్ బోనస్ రూ. 15 వేలు, కార్పొరేట్ బెనిఫిట్స్ మరో 7000 కలిపి మొత్తం 37,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తోంది.  


మారుతి సుజుకి ఆల్టో 800 పై రూ. 36,000 వరకు డిస్కౌంట్ 
మారుతి సుజుకి ఆల్టో 800 పై ఎక్స్‌చేంజ్ బోనస్ రూ. 15 వేలు, క్యాష్ బోనస్ రూ. 15 వేలు, కార్పొరేట్ బెనిఫిట్స్ రూ. 6000 కలిపి మొత్తం రూ. 36,000 వరకు డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదే మోడల్లో బేస్ వేరియంట్‌పై రూ. 11 వేలు డిస్కౌంట్ లభిస్తుండగా సీఎన్జీ వేరియంట్స్‌పై రూ 33,100 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.


మారుతి సుజుకి వాగన్ ఆర్‌పై రూ. 36,000 వరకు డిస్కౌంట్
మారుతి సుజుకి వాగన్ ఆర్‌పై రూ. 36,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇందులో ఎక్స్‌చేంజ్ బోనస్ రూ. 15 వేలు కాగా క్యాష్ డిస్కౌంట్ కింద రూ. 15 వేలు, కార్పరేట్ డిస్కౌంట్ కింద రూ. 6 వేలు ఆఫర్స్ అందిస్తోంది మారుతి సుజుకి. వాగన్ ఆర్ సిఎన్జీ వేరియంట్స్‌పై రూ. 33,100 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే పెట్రోల్ ఏఎంటి వేరియంట్స్‌పై రూ. 21,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.


ఇది కూడా చదవండి : Oneplus 5G Smartphones: వన్‌ప్లస్ నుంచి తక్కువ ధరకే మరో సూపర్ స్మార్ట్‌ఫోన్


ఇది కూడా చదవండి : Rs 39,000 Smartphone for Rs 8000: రూ. 39 వేల స్మార్ట్ ఫోన్ జస్ట్ రూ. 8 వేలకే.. బంపర్ ఆఫర్


ఇది కూడా చదవండి : Free Life Insurance Scheme: ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ. 7 లక్షల బెనిఫిట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook