Top 5 CNG Cars Under 5 Lakhs: మార్కెట్‌లో అధిక మైలేజీనిచ్చే డెడ్ ఛీప్ CNG కార్లు ఇవే! ఓ లుక్కేయండి
Top CNG Cars Under 5 Lakhs: ప్రస్తుతం మార్కెట్‌లో సీఎన్‌జీతో నడిచే చాలా రకాల కార్లు ఉన్నాయి. ఇవీ డేడ్ ఛీప్‌గా లభించడమేకాకుండా అధికంగా మైలేజీని ఇస్తాయి. అయితే ఈ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Best CNG Cars Under 5 Lakhs Automatic: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) వాహనాలకు డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా ఇవి అధికంగా మైలేజీని ఇవ్వడంతో సాధరణ వినియోగదారులు CNG కార్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం సీఎన్‌జీ ధరలను తగ్గించడంలో ఈ కార్ల ఉత్పత్తులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఢిల్లీలో సీఎన్‌జీ కిలో రూ.73.59కి లభిస్తోంది. కాబట్టి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌తో నడిచే కారును కొనుగోలు చేస్తే డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చిన ఈ CNG కారుతో ఎక్కువ మైలేజీని పొందొచ్చు.
సీఎన్‌జీతో నడిచే వాహానాల వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిని వినియోగించడం వల్ల వాతావరణ కాలుష్యం నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా మైలేజీ పరంగా కూడా చాలా లాభాలున్నాయి. ఈ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) వాహనాలు తక్కవ ధరలకు లభించడం వల్ల సాధరణ వినియోగదారులు కూడా సులభంగా కొనుగోలు చేయోచ్చు. ఇంతక ముందు మారుతీ సుజుకీ ఆల్టో 800 ఉత్పత్తు అధికంగా ఉన్నప్పటికీ ఇటీవలే వీటి అమ్మకాలను కంపెనీ నిలిపివేసింది. కానీ ఇప్పటికీ చాలా కంపెనీలకు చెందిన చౌకైన CNG కార్ల ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సీఎన్‌జీతో నడిచే వాహానాల డెడ్ ఛీప్ కార్లు ఇవే:
టాటా టియాగో iCNG (Tata Tiago iCNG)
ప్రస్తుతం ఈ కారు మార్కెట్‌లో రూ. 6.50 లక్షల నుంచి రూ. 8.11 లక్షలు ధరల్లో లభిస్తోంది.
ఒక కేజీ సీఎన్‌జీకి 26.49 km/kg మైలేజ్ ఇస్తుంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్‌జీ (Maruti Suzuki WagonR CNG)
ఈ కారు మార్కెట్‌లో రూ. 6.45 లక్షలకు ప్రారంభమవుతుంది.
ఒక కేజీ సీఎన్‌జీకి 34.05కిమీ మైలేజ్ ఇస్తుంది.
Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్ జట్టులో ఉండాల్సిందే..!
మారుతి సుజుకి సెలెరియో CNG (Maruti Suzuki Celerio CNG )
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ కారు రూ. 6.74 లక్షలుగా ఉంది.
కేజీ సీఎన్‌జీకి 35.60 కిమీ మైలేజ్ ఇస్తుంది.
మారుతి సుజుకి S-ప్రెస్సో CNG (Maruti Suzuki S-Presso CNG)
ఈ కారు ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 5.92 లక్షలగా ఉంది.
కేజీ సీఎన్‌జీకి 32.73 కిమీ మైలేజ్ రేంజ్‌ను కలిగి ఉంటుంది.
Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్ జట్టులో ఉండాల్సిందే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి