Maruti Fronx vs Tata Punch: మారుతి సుజుకి ఇటీవలే కొత్త మోడల్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ లాంచ్ చేసింది. ఈ కారు మార్కెట్‌లో పాతుకుపోయి ఉన్న టాటా పంచ్‌కు గట్టి పోటీ ఇస్తోంది. మారుతి సుజుకి లాంచ్ చేసిన ఫ్రాంక్స్ ఒక మిడ్ సైజ్ ఎస్‌యూవీ. మారుతి బ్రెజా, బలేనోకు మధ్యలో ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిడ్ సైజ్ ఎస్‌యూవీలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ విభాగంలో టాటా పంచ్ తనదైన వాటాను కలిగి ఉంది. ఇప్పుడు కొత్తగా టాటా పంచ్‌కు పోటీగా మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ను ప్రవేశపెట్టింది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు టాటా పంచ్ లేదా మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో ఏది ఉత్తమమనే చర్చ వస్తోంది. టాటా పంచ్‌లో లేని 5 ఫీచర్లు మారుతి ఫ్రాంక్స్‌లో ఉన్నాయి. ఈ ఫీచర్లు నచ్చితే మారుతి సుజుకి ఫ్రాంక్స్‌నే ఎంచుకోవచ్చు.


హెడ్స్ అప్ డిస్‌ప్లే. మారుతి ఫ్రాంక్స్‌లో ఉన్న ఈ పీచర్ టాటా పంచ్‌లో లేదు. ఈ డిస్‌ప్లే‌లో ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, వాహనం తీరు, ఇంజన్ ఆర్పీఎం వంటి సమాచారం లభ్యమౌతుంది. గతంలో ఇలాంటి ఫీచర్లు మారుతి బలేనోలో ఉన్నాయి. 


మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో కొత్తగా 6 స్పీడ్ టార్క్ కన్వర్టరక్ ఆటోమేటిక్ టాన్స్ మిషన్‌తో పాటు పెడల్ షిప్టర్స్ ఉన్నాయి. ఈ సౌకర్యం కూడా టాటా పంచ్‌లో లేదు. అయితే ఫ్రాంక్స్‌లోని టర్బో పెట్రోల్ వేరియంట్‌కే పెడల్ షిఫ్టర్స్ సౌకర్యం ఉంది.


360 డిగ్రీల పార్కింగ్ కెమేరా ఫీచర్ మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో ఉంది. ఈ ప్రత్యేకత టాటా పంచ్‌లో లేదు. టాటా పంచ్ కేవలం రివర్స్ పార్కింగ్ కెమేరా కలిగి ఉంటుంది. 360 డిగ్రీ పార్కింగ్ కెమేరా కారణంగా వాహనాన్ని చాలా సులభంగా పార్క్ చేయవచ్చు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతుంది.


వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్. ఈ సౌకర్యం టాటా పంచ్‌లో లేదు. టాటా పంచ్‌లో కేవలం యూఎస్‌బీ ఛార్జర్ మాత్రమే ఉంటుంది. ఫ్రాంక్స్‌లో ఈ ఫీచర్ మరో ప్రత్యేకత. ఫ్రాంక్స్‌లో ఆండ్రాయిడ్, యాపిల్ కార్‌ప్లేతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. టాటా పంచ్‌లో ఈ ఫీచర్ లేదు.


ఎల్ఈడీ హెడ్ లైట్స్. ఈ ఫీచర్ మారుతి ఫ్రాంక్స్ టాప్ వేరియంట్‌లో ఉంది. టాటా పంచ్‌లో హేలోజన్ ఆధారిత ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫ్రాంక్స్‌లో ఫాగ్ లైట్స్ లేవు. టాటా పంచ్‌లో కార్నరింగ్ ఫంక్షన్‌తో పాటు హేలోజన్ ఫాగ్ లైట్స్ ఉన్నాయి.


Also read: Electric Truck: త్వరలోనే మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ట్రక్కులు.. ఇక డీజిల్ ట్రక్కులకు గుడ్ బై..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook