Maruti Cars: ఆటోమేటిక్ కార్ల విక్రయాల్లో మారుతి టాప్, 10 లక్షలకు పైగా అమ్మకాలు
Maruti Cars: దేశంలోని వివిధ కంపెనీల కార్లలో మారుతి సుజుకి స్థానం ప్రత్యేకమైంది. దేశ ప్రజలకు మారుతి సుజుకి అంటే ఓ నమ్మకమైన బ్రాండ్ కూడా. అందుకే ప్రతి ఎలా అమ్మకాల్లో మారుతి కంపెనీ కార్లే ముందంజలో ఉంటాయి.
Maruti Cars: దేశీయ కారు మార్కెట్‌లో మారుతి సుజుకి వాటా చాలా ఎక్కువ. దేశంలోని అతిపెద్ద కారు కంపెనీ కూడా ఇదే. కొన్ని దశాబ్దాల నుంచి మారుతి సుజుకి దేశంలో నెంబర్‌వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్ కార్ల విభాగంలో కూడా మారుతి పట్టు సాధించేసింది.
ప్రతి ఏటా ప్రతి నెలా దేశంలో జరిగే టాప్ 10 కార్ల విక్రయాల్లో 5-6 కార్లు మారుతి సుజుకి కంపెనీవే ఉంటున్నాయి. దీనికితోడు టాప్ 3 కార్లు మారుతివే ఉంటాయి. దేశ కార్ మార్కెట్‌లో మారుతి స్థానం అలాంటిది. ఇప్పుడు ఆటోమేటిక్ కార్ల విభాగంలో కూడా పట్టు సాధించింది. ఇప్పటివరకూ 10 లక్షలకు పైగా ఆటోమేటిక్ కార్లను విక్రయించింది. మారుతి సుజుకి కంపెనీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండియాలో టూ పెడల్ ఆటోమేటిక్ కార్ల టెక్నాలజీపై ప్రజాదరణ పెంచేందుకు కీలక పాత్ర పోషించామని కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకూ 10 లక్షలకు పైగా ఆటోమేటిక్ కార్ల విక్రయాలు జరిపినట్టు పేర్కొంది. ప్రస్తుతం మారుతి సుజుకి తన 16 మోడల్ కార్లలో4 వేర్వేరు ఆటోమేటిక్, ట్రాన్స్‌మిషన్ సిస్టమ్, ఆటో గేర్ షిఫ్ట్, 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, స్టీరింగ్ మౌంటెడ్ పెడల్ షిఫ్టర్స్‌తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఎలక్ట్రానిక్ కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ ఆఫర్ చేస్తోంది.
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఆటోమేటిక్ కార్ల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయని కంపెనీ తెలిపింది. ఈ ఆర్ధిక సంవత్సరం అంటే 2023-24లో 1 లక్ష ఆటోమేటిక్ కార్ల అమ్మకాలకు సమీపంలో ఉన్నామని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. ఇంకా ఆరు నెలల సమయం ఉండటంతో ఈ ఏడాది చాలా గణనీయంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.
మారుతి సుజుకి 2014లో ఏజీఎస్ టెక్నాలజీ ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీ కస్టమర్లను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మారుతి సుజుకి ఆటోమేటిక్ వాహన విక్రయాల్లో 65 శాతం ఏజీఎస్ టెక్నాలజీ ఉన్నవే. ఏటీ ట్రాన్స్‌మిషన్ మోడల్ విక్రయాలు మొత్తం విక్రయాల్లో 27 శాతమున్నాయి. అటు హైబ్రిడ్ ఈ సీవీటీ ట్రాన్స్‌మిషన్ అమ్మకాలు 8 శాతమున్నాయి.
Also read: Top 5 Best Selling Cars: నెక్సాన్, బ్రిజా, వేగన్ ఆర్ కంటే అత్యధికంగా విక్రయమైన కారు, ధర కూడా తక్కువే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook