Top 5 Best Selling Cars: నెక్సాన్, బ్రిజా, వేగన్ ఆర్ కంటే అత్యధికంగా విక్రయమైన కారు, ధర కూడా తక్కువే

Top 5 Best Selling Cars: దేశంలో ఇటీవలి కాలంలో ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. సెప్టెంబర్ నెలలో కార్లు భారీగా విక్రయమయ్యాయి. పండుగ సీజన్ కావడంతో సహజంగానే కార్ల అమ్మకాలు అధికంగానే ఉంటాయి. సెప్టెంబర్ 2023లో అత్యధికంగా విక్రయమైన కార్లు ఏంటో తెలుసుకుందాం.

1 /5

మారుతి వేగన్ ఆర్ మారుతి వేగన్ ఆర్ సెప్టెంబర్ 2023లో అత్యధికంగా విక్రయమైన రెండవ కారు. మొత్తం 16,250 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 19 శాతం అమ్మకాలు పడిపోయాయి.

2 /5

టాటా నెక్సాన్ సెప్టెంబర్ 2023లో టాటా నెక్సాన్ అత్యధికంగా విక్రయమైన మూడవ కారుగా ఉంది. మొత్తం 15,325 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. టాటా నెక్సాన్ మాత్రం గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగింది. 

3 /5

మారుతి స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ సెప్టెంబర్ 2023లో మొత్తం 14,703 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 23 శాతం పరిగింది. 

4 /5

బ్రిజా సెప్టెంబర్ 2023లో మారుతి సుజుకి బ్రిజా అత్యధికంగా విక్రయమైన నాలుగవ కారు. మొత్తం 15 వేల యూనిట్లు విక్రయమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 3 శాతం తక్కువ. 

5 /5

సుజుకి బలేనో మారుతి సుజుకి బలేనో సెప్టెంబర్ 2023లో అత్యధికంగా విక్రయమైంది. మొత్తం 18,417 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 5 శాతం తక్కువే. ఎందుకంటే గత ఏడాది ఇదే సమయానికి 19,369 యూనిట్ల విక్రయాలు జరిగాయి.