Maruti Price hike: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరోసారి ధరల పెంపునకు సిద్ధమైంది. కొత్త ధరలు ఈ నెలలోనే అమలులోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా చేసింది. ముడి సరకు ధరల పెరుగుదల కారణాలతో.. ఉత్పత్తి వ్యయాలు పెరిగినట్లు తెలిపింది మారుతీ సుజుకీ. ఇదే కారణంతో ఇంతకు ముందు కూడా పలు మార్లు ధరలను పెంచింది మారుతీ సుజుకీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు నియంత్రణ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో.. వివిధ ముడి సరకుల ధరలు పెరిగటం వల్ల.. పెరిగిన తయారీ భారాన్ని వినియోగదరాలకు సరఫరా చేయక తప్పడం లేదని వివరించింది మారుతీ సుజుకీ.


2021 జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు వాహనాల ధరలు పెంచింది మారుతీ సుజుకీ. దీనితో 9 శాతం మేర ధరలు పెరిగాయి.


ఇప్పటికే టాటా మోటార్స్​, హీరో మోటాకార్ప్​, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు కూడా ఏప్రిల్​ నుంచి తమ వాహనాల ధరలు పెంచనున్నట్లు ప్రకటించాయి.


ఈకో వాహనాలు రీకాల్​..


ధరల పెంపు అటుంచితే.. మారుతీ సుజుకీ ఈకో మోడళ్లను రీకాల్​ చేయనున్నట్లు ప్రకటించింది. ఆ మోడల్​లో సాంకేతిక సమస్యల కారణంగా 19,731 యూనిట్లు రీకాల్ చేయనున్నట్లు వివరించింది.


2021 జులై 19 నుంచి 2021 అక్టోబర్​ 5 మధ్య తయారైన ఈకో మోడళ్లను మాత్రమే రీకాల్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వాహనాలను కొనుగోలు చేసిన వినియోగదారులను తమ డీలర్​లు నేరుగా సంప్రదిస్తారని కూడా వెల్లడించింది మారుతీ సుజుకీ.


Also read: Galaxy A73: శాంసంగ్​ గెలాక్సీ ఏ73 ప్రీ బుకింగ్స్ షురూ.. రూ.499కే గెలాక్సీ బడ్స్​


Also read: Mobile Savings Days: స్మార్ట్​ఫోన్లపై అమెజాన్ సమ్మర్​ కూల్ ఆఫర్లు- పూర్తి వివరాలివే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook