Maruti Suzuki to Launches Maruti Invicto: మారుతి నుంచి ఇప్పటికే 7 సీటర్ కారు ఎర్టిగా మార్కెట్‌లో ఉంది. అత్యధిక ఆదరణ కలిగిన కారు ఇది. ఇప్పుడు మరో 7 సీటర్ ఎంపీవీ లాంచ్‌కు సన్నద్దమౌతోంది మారుతి సుజుకి. ఈ కారు పేరు, ఫీచర్లు ఎలా ఉంటాయనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతి సుజుకి నుంచి మరో 7 సీటర్ కారు అందుబాటులోకి రానుంది. ఈ కారు పేరు మారుతి ఇన్విక్టో. ఇదొక ఎంపీవీ మోడల్ కారు. జూలై 5వ తేదీన మారుతి సుజుకి కంపెనీ మారుతి ఇన్విక్టోను లాంచ్ చేయనుంది. మారుతి కంపెనీ అధికారికంగా ఈ కారు బుకింగ్స్ ప్రారంభించింది. మారుతి నెక్సా అధికారిక వెబ్‌ సైట్ నుంచి లేదా మీకు దగ్గరలోని నెక్సా డీలర్ వద్దకు వెళ్లి మారుతి ఇన్విక్టో బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఎంపీవీ జూలై 5న లాంచ్ కానుంది. టొయోటా హైక్రాస్ ఆధారంగా రూపుదిద్దుకున్న మారుతి ఇన్విక్టో మార్కెట్‌లో హైక్రాస్, కియా కార్నివాల్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700-7సీటర్, హ్యుండయ్ అల్‌కజార్, ఎంజీ హెక్టార్ ప్లస్‌తో పోటీ పడనుంది.


మారుతి ఇన్విక్టో వర్సెస్ టొయోటా ఇన్నోవా హైక్రాస్ పోల్చి చూస్తే డైమెన్షన్స్ సమానంగా ఉంటాయి. ఈ కారు పొడవు 4735 మిల్లీమీటర్లు కాగా వెడల్పు 1850 మిల్లీమీటర్లు, ఎత్తువ 1795 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇక వీల్ బేస్ 2850 మిల్లీమీటర్లు. మారుతి ఇన్విక్టో బూట్ స్పేస్ 300 లీటర్లుగా ఉంటుంది. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 185 మిల్లీమీటర్లు ఉంది. ఇక ఇంధనం ట్యాంక్ సామర్ధ్యం 52 లీటర్లు.


Also Read: Margadarsi Case: మార్గదర్శికి మరో షాక్, 23 చిట్ గ్రూపులు నిలిపివేత, కేంద్ర దర్యాప్తు


మారుతి ఇన్విక్టో ఇంజన్ ప్రత్యేకతలు


మారుతి ఇన్విక్టోలో 2 ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 2 లీటర్ పెట్రోల్ కాగా రెండవది 2 లీటర్ల పెట్రోల్ హైబ్రిడ్. టొయోటా ఇన్నోవా హైక్రాస్‌లానే ఇన్విక్టాలో 2 లీటర్ల సాధారణ పెట్రోల్ ఇంజన్ 6600 ఆర్పీఎంపై 174 పీఎస్ పవర్, 204 ఎన్ఎం టార్క్ శక్తి ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు కేవలం సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తోనే అనుసంధానించారు. ఇన్నోవా హైక్రాస్‌లో 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 186 పీఎస్ పవర్, 4400 ఆర్బీఎం, 5200 ఆర్బీఎంతో పాటు 206 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.


మారుతి నెక్సా ఇన్విక్టో 2023 టాప్ ఫీచర్లు ఇవే


మారుతి ఇన్విక్టో 2023లో 8 వే పవర్ డ్రైవర్ సీట్ ఉంటుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఐఆర్ కట్ విండో, 10.1 ఇంచెస్ టచ్ స్క్రీన్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్, పెడల్ ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, కలర్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏంబియంట్ లైటింగ్, పెడల్ షిఫ్టర్స్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, 17 ఇంచెస్ ఎలాయ్ వీల్, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్, సన్ రూఫ్, పవర్ టెల్ గేట్ ఉన్నాయి.


మార్కెట్‌లో ఉన్న ఇన్నోవా హైక్రాస్, కియా కార్నివాల్, మహీంద్రా ఎక్స్ యూవీ 700, హ్యుండయ్ అల్‌కజార్, ఎంజి హెక్టార్ ప్లస్ కార్లతో పోటీ పడనుంది. ఇక ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేవలం 25 వేల రూపాలు చెల్లించి బుకింగ్స్ చేసుకోవచ్చు.


Also Read: Best Cars: 5 లక్షల కంటే తక్కువ ధర కలిగిన టాప్ మైలేజ్ కార్లు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి