Best Cars under Rs 5 Lakhs in India: సొంత కారు ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ బడ్జెట్ సహకరించక ఆగిపోతుంటారు. ఇంకొందరు ఈఎమ్ఐలపై కారు కొనుగోలు చేస్తుంటారు. మీక్కూడా కారు కొనే ఆలోచన ఉంటే బడ్జెట్ ఫ్రీ కారు కోసం చూస్తుంటే ఈ ఆర్టికల్ మీ కోసమే. ఇక్కడ మేం 5 లక్షల్లోపుండే కార్ల గురించి వివరాలు అందిస్తాం. మీకు ఏ కారు అనువైందో ఎంపిక చేసుకోవచ్చు.
కొత్త కారు కొనాలంటే కనీస బడ్జెట్ 5 లక్షల రూపాయలుండాల్సిందే. అలాగని 5 లక్షలకు అన్ని కార్లు అందుబాటులో ఉండవు. కారు ధర తక్కువగా ఉండటమే కాకుండా మైలేజ్ బాగుండాలి, డీజిల్ లేదా సీఎన్జీ ఆప్షన్ ఉండాలి. అప్పుడే నిర్వహణ సులభమౌతుంది. ధర తక్కువగా ఉండి, మైలేజ్ ఎక్కువ ఇచ్చే కొన్ని కార్ల గురించి తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే బడ్జెట్ ఎంత ఉన్నా సరే మైలేజ్ అనేది దీర్ఘకాలంలా చాలా ప్రభావం చూపిస్తుంది. ప్రతి నెలా అదనపు ఖర్చును తగ్గించేది మైలేజ్ ఒక్కటే. ఈ కార్ల ఎక్స్ షోరూం ధర 5 లక్షల కంటే తక్కువే ఉంది. ఈఎంఐ పద్ధతిలో కారు కొనాలనుకుంటుంటే..ఈ కార్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
రెనో క్విడ్
రెనో క్విడ్ కారు ధర చాలా తక్కువ. తక్కువ బడ్జెట్ అంటే 5 లక్షల కంటే తక్కువగా ఈ కారు సొంతం చేసుకోవచ్చు. ఈ కారు ఎక్స్ షోరూం ధర 4 లక్షల 69 వేలుగా ఉంది. ఈ కారు లుక్, ఫీచర్లు అద్భుతంగా ఉంటాయి. అన్నింటికీ మించి రెనో క్విడ్ కారు లీటరుకు 22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
Also Read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గుడ్‌న్యూస్, ఉద్యోగుల జీతం 26 వేలు
మారుతి సుజుకి ఆల్టో కే10
మారుతి సుజుకి ఆల్టో కే పదేళ్ల క్రితం లాంచ్ అయిన కారు. ఇందులో శక్తివంతమైన ఇంజన్, పవర్‌తో పాటు అన్ని ఫీచర్లు ఉన్నాయి. మారుతి సుజుకి ఆల్టో కే10 ప్రారంభ ధర కేవలం 3.99 లక్షల రూపాయలే. ఇది ఎక్స్ షోరూం ధర. ఈ కారు మైలేజ్ లీటరుకు 24.9 కిలోమీటర్లు ఇస్తుంది. ఆల్టో కే 10లోనే సీఎన్జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది మరింత మైలేజ్ ఇస్తుంది.
మారుతి సుజుకి ఎస్ ప్రెసో
మారుతి సుజుకి కంపెనీ నుంచి మరో కారు 5 లక్షల బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. అదే మారుతి సుజుకి ఎస్ ప్రెసో. ఈ కారు లుక్స్, ఫీచర్లు చాలా బాగుంటాయి. ఈ 5 సీటర్ కారు ధర 4 లక్షల 26 వేలు ఎక్స్ షోరూం ధరగా ఉంది. మారుతి సుజుకి ఎస్ ప్రెసో లీటరుకు 25.3 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఈ కారు పెట్రోల్, సీన్జీ రెండు వేరియంట్లలో ఉంది.
Also Read: Twitter: ట్విట్టర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. యూట్యూబ్‌కు దీటుగా వీడియో యాప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి