Maruti Brezza as Top Selling SUV Car in India: దేశంలో చాలా రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. ఒకదాన్ని మించి మరొక కారు మార్కెట్‌లో అడుగెడుతోంది. ఎన్ని కంపెనీలు వచ్చినా, మరెన్ని మోడల్ కార్లు రంగప్రవేశం చేసినా మారుతి సుజుకి ముందు దిగుదుడుపేనా అనకతప్పడం లేదు. మారుతి కంపెనీ కార్ల విక్రయాలు అందుకు తార్కాణం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతి సుజుకి టాప్ ఎండ్ కార్లలో ఒకటి మారుతి సుజుకి బలేనో. దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న కారు ఇదే. మారుతి సుజుకి బలేనోకు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అందుకే ప్రతి నెలా అత్యధిక విక్రయాలు జరుపుతోంది. మే 2023లో మారుతి సుజుకి 1,43,708 కార్ల విక్రయాలు జరిపింది. అదే సమయంలో గత ఏడాదితో పోలిస్తే విక్రయాల్లో 15.4 శాతం వృద్ధి కూడా నమోదు చేసింది. మారుతి సుజుకి బలేనో దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న కారుగా ఉంది. మే నెలలో ఏకంగా 18 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక మారుతి సుజుకి కంపెనీకే చెందిన స్విఫ్ట్, వేగన్ ఆర్ కూడా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 


దేశంలో మారుతి సుజుకికు చెందిన మరో కారు ఊహించని రీతిలో విక్రయాలు నమోదు చేస్తోంది. ఈ కారు మారుతి సుజుకి బ్రెజా. ఈ కారు ధర ఏకంగా 8.30 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. కానీ హ్యుండయ్, టాటా కార్ల కంటే మాత్రం వెనుకబడి ఉంది. ఈ ఏడాది మే నెలలో 13,398 యూనిట్ల విక్రయాలు జరిపింది. గత ఏడాది అంటే 2022 మే నెలలో 10,312 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే మారుతి సుజుకి బ్రెజా 30 శాతం వృద్ధి సాధించింది. ఏకంగా 30 శాతం వార్షిక వృద్ధి సాధించినా హ్యుండయ్, టాటా కంపెనీలతో పోలిస్తే వెనుకంజలో ఉండిపోయింది మారుతి బ్రెజా.


మారుతి బ్రెజా మే నెలలో అత్యధికంగా విక్రయమైన కార్లలో మూడవ స్థానంలో నిలిచిన ఎస్‌యూవీగా ఉంది. మొదటి స్థానంలో హ్యుండయ్ క్రెటా మే నెలలో 14,449 యూనిట్ల అమ్మకాలతో 32 శాతం వృద్ది రేటు సాధించింది. ఇక రెండవ స్థానంలో ఉన్న టాటా నెక్సాన్ మే నెలలో 14,423 యూనిట్ల అమ్మకాలతో 1 శాతం తక్కువ నమోదు చేసింది.


మారుతి బ్రెజా ఒక ఎస్‌యూవీ. ఈ కారు ధర 8.29 లక్షల రూపాయల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో హై ఎండ్ అయితే 14.14 లక్షల వరకూ ఉంటుంది. మారుతి సుజుకి బ్రెజా LXi, VXi, ZXi,ZXi (O) నాలుగు వేరియంట్లలో లభ్యమౌతోంది. మారుతి సుజుకి బ్రెజాలో 1.5 లీటర్ కే 12సి పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 103 బీహెచ్‌పి పవర్, 138 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు మోటార్‌ను 6 స్పీడ్ మేన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో అనుసంధానించారు. ఎస్‌యూవీ కార్లలో మారుతి బ్రెజా సక్సెస్ అనే చెప్పవచ్చు. 


Also Read: Maruti Invicto: మారుతి నుంచి కొత్త ఎంపీవీ 7 సీటర్, 25 వేలు చెల్లించి ఇవాళే బుక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి