The market valuation of top-10 BSE companies: దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం మొత్తం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. వారంతాలం రికార్డు స్థాయిలో నష్టాలను మూటగట్టుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారం మొత్తం మీద బీఎఈ-సెన్సెక్స్ (BSE sensex) 2,528 పాయింట్లు (4.24 శాతం) నష్టోపోయింది. ఇందులో అధిక భాగం చివరి సెషన్​లోనే కావడం గమనార్హం.


భారీ నష్టాల దెబ్బకు దేశంలో అత్యధిక మార్కెట్​ క్యాపిటల్ కలిగిన టాప్​ 10 కంపెనీల్లో (BSE top 10) 9 సంస్థలు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ తొమ్మిది కంపెనీలు ఐదు సెషన్లలో రూ.2.62 లక్షల కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి.


నష్టాలకు కారణాలు ఏమిటి?


దేశీయంగా కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. అయితే ప్రపంచదేశాల్లో మాత్రం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నయి. ముఖ్యంగా జర్మనీ, బ్రిటన్, పోలాండ్​, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతన్నాయి. దీనికి తోడు దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్​ ఆందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్​గా నామకరణం చేసిన ఈ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళనలను మరింత పెంచింది. ఈ కారణాలన్నింటి వల్ల స్టాక్ మార్కెట్లు గత వారం భారీగా నష్టాలను నమోదు చేశాయి.


బీఎస్​ఈ ప్రకారం టాప్ 10 కంపెనీల నష్టాలు ఇలా..


బజాజ్ ఫినాన్స్ మార్కెట్ క్యాపిటల్ (Bajaja Finance Mcap) గత వారం అత్యధికంగా రూ.41,518.24 కోట్ల తగ్గి.. రూ.4,10,670.50 కోట్ల వద్దకు చేరింది.


రిలయన్స్ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ (ఆర్​ఐఎల్​) మార్కెట్​ క్యాపిటల్ (Reliance Mcap)​ రూ.38,440.66 కోట్లు పడిపోయింది. దీనితో కంపెనీ ఎం-క్యాప్​ రూ.15,30,109.51 కోట్లకు చేరింది.


టెక్​ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటల్ (Infosys Mcap)​ రూ.37,950.03 కోట్లు తగ్గింది. ప్రస్తుతం దీని ఎం-క్యాప్ రూ.7,10,925.34 కోట్ల వద్ద ఉంది.


హెచ్​డీఎఫ్​సీ మార్కెట్ క్యాపిటల్ (HDFC Mcap) రూ.33,067.68 కోట్లు పడిపోయింది. దీనితో సంస్థ మార్కెట్ క్యాపిటల్​ రూ.4,96,168.98 వద్దకు దిగొచ్చింది.


ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ మార్కెట్ క్యాపిటల్ (SBI Mcap) రూ.29,852.83 కోట్లు తగ్గింది. దీనితో బ్యాంక్ మార్కెట్​ క్యాపిటల్​ రూ.4,19,902.97 వద్దకు చేరింది.


ఐసీఐసీఐ  బ్యాంక్ మార్కెట్ క్యాపిటల్ (ICICI Mcap)​ గత వారం రూ.28,567.03 కోట్లు దిగొచ్చి.. రూ.5,01,039.91 కోట్ల వద్దకు చేరింది.


ప్రైవేటి రంగ అతిపెద్ద బ్యాంక్​గా ఉన్న హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటల్ (HDFC Bank Mcap)​ గత వారం రూ. 26,873.77 కోట్లు ఆవిరైంది. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాపిటల్​ రూ.8,25,658.59 వద్ద కొనసాగుతోంది.


హిందుస్థాన్ యూనిలీవర్​ లిమిటెడ్ (హెచ్​యూఎల్​) మార్కెట్ క్యాపిటల్ (HUL Mcap)​ రూ. 14,778.93 కోట్లు తగ్గి.. రూ.5,48,570.82 కోట్ల వద్దకు చేరింది.


దేశీయ అతిపెద్ద టెక్​ దిగ్గజం.. టీసీఎస్​ మార్కెట్​ క్యాపిటల్​ (TCS Mcap) గత వారం రూ.11,097.15 పడిపోయింది. ప్రస్తుతం టీసీఎస్​ ఎం-క్యాప్​ రూ.12,74,563.64 కోట్లుగా ఉంది.


గత వారం మొత్తం మీద టాప్​ 10 కంపెనీల్లో భారతీ ఎయిర్​టెల్ మాత్రమే లాభాలను నమోదు చేసింది. ఎయిర్​టెల్​ మార్కెట్ క్యాపిటల్ గత వారం రూ.2,769.55 కోట్లు పెరిగింది. ప్రస్తుతం దీని ఎం-క్యాప్ రూ.4,05,009.55 కోట్లు.


ఇక దేశంలో అత్యధిక మార్కెట్ క్యాపిటల్ కలిగిన కంపెనీలను పరిశీలిస్తే.. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ప్రథమ స్థానంలో ఉంది. టీసీఎస్​ రెండు స్థానంలో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్​, హెచ్​యూఎల్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


Also read: November 30 Deadline: నవంబర్ ముగుస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?


Also read: మళ్లీ పెరిగిన బంగారం ధరలు, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook