మళ్లీ పెరిగిన బంగారం ధరలు, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

మొన్న వరుసగా మూడ్రోజులపాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ మళ్లీ పెరిగింది. ఊహించనిరీతిలో బంగారం ధరలు పెరుగుతూ వినియోగదారునికి షాక్ ఇస్తున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 28, 2021, 06:54 AM IST
మళ్లీ పెరిగిన బంగారం ధరలు, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

మొన్న వరుసగా మూడ్రోజులపాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ మళ్లీ పెరిగింది. ఊహించనిరీతిలో బంగారం ధరలు పెరుగుతూ వినియోగదారునికి షాక్ ఇస్తున్నాయి.

బంగారం ధరలు(Gold Price) ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పులు, ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ బంగారం నిల్వలు, వడ్డీ రేటు, కరోనా మహమ్మారి, బౌగోళిక ఘర్షణలు వంటివి ఎప్పటికప్పుడు బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయి. గత మూడ్రోజుల్నించి తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ మరోసారి పెరిగింది. దేశవ్యాప్తంగా పది గ్రాముల బంగారంపై 370 రూపాయల వరకూ పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరల పెరుగుదల ఇలా ఉంది. 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లు(Delhi Gold Price) పది గ్రాముల బంగారం ధర 47 వేల 310 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 490 రూపాయలుగా ఉంది.  ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 310  కాగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 310 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 240 అయితే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 350 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేలుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 7 వందలుగా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 150 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 50 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 150 రూపాయలుగా ఉంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో ధర ఢిల్లీ, ముంబైతో పోలిస్తే చాలా తక్కువగా ఒకేలా ఉంది. హైదరాబాద్‌లో(Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర 49 వేల 150 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 150 రూపాయలుంది.  అటు విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

Also read: SBI: ఎస్​బీఐకి షాక్​- రూ.కోటి జరిమానా విధించిన ఆర్​బీఐ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News