MedPlus Health Services Ltd’s initial public offer (IPO) will open for subscriptions on Monday: హైదరాబాద్​కు చెందిన ఫార్మసీ రిటైల్ స్టోర్ల నిర్వహణ సంస్థ మెడ్​ప్లస్​ హెల్త్ సర్వీసెస్​ లిమిటెడ్​ (MedPlus IPO).. ఇనీషియల్​ పబ్లిక్ ఆఫర్​ (ఐపీఓ)కు అంతా రేడీ అయ్యింది. రేపటి నుంచి (సోమవారం) ఐపీఓ ప్రారంభం కానుంది. షేర్లు సబ్​స్క్రైబ్ చేసుకునేందుకు ఈ నెల 15 చివరి తేదీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిధుల సమీకరణ లక్ష్యం ఇలా..


రూ.1,398 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది మెడ్​ప్లస్​. ఐపీఓలో ఒక్కో షేరు ధరను (MedPlus IPO share Price) రూ.780 నుంచి రూ.796 మధ్య ఉంచింది. షేరు ముఖ విలువ రూ.2 గా ఉంది.


ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్​ (18 షేర్లు) కొనేందుకు దరఖాస్తు (MedPlus IPO lat size) చేసుకోవాలి. లాట్ ధర రూ.14,040 నుంచి రూ.14,328 మధ్య ఉంటుంది.


ఐపీఓలో రూ.600 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయనుంది కంపెనీ. దీనితో పాటు రూ.798 కోట్లను సమీకరకించేందుకు ఆఫర్​ ఫర్ సేల్ (OFS)​ నిర్వహించింది. ఇప్పటికే సంబంధింత ప్రక్రియ పూర్తయింది.


ఉద్యోగులకోసం రూ.5 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేసిది కంపెనీ. అర్హులైన ఉద్యోగులు ఎవరైతే ఐపీఓకు అప్లయి చేసుకుంటారో.. వారికి ఒక్కో షేరుపై రూ.78 వరకు రాయితీ లభించనుంది.


రన్నింగ్​​ మేనేజర్లుగా..


మెడ్​ప్లస్​ ఐపీఓకు యాక్సిస్​ క్యాపిటల్​, క్రెడిట్ సూయిస్ సెక్యూరిటీస్​ (ఇండియా), ఎడిల్​వైజ్​ ఫినాన్షియల్ సర్వీసెస్​ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా) వంటవి రన్నింగ్​ మేనేజర్లుగా ఉన్నాయి.


నిధుల వినియోగం ఇలా..


ఐపీఓ ద్వారా సేకరించే నిధులను మూలధన అవసరాలకు వినియోగించుకోనున్నట్లు కంపెనీ ఇది వరకే వెల్లడించింది. సంస్థ విస్తరణ ప్రణాళికలకు ముఖ్యంగా 'ఆప్టివల్' కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు తెలిపింది.


మెడ్​ప్లస్​కు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2 వేలకు పైగా స్టోర్లు ఉన్నాయి. 150కిపైగా నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.


మెడ్​ప్లస్​ గురించి(About MedPlus)..


మెడ్​ప్లస్​ 2006లో ప్రారంభమైంది. గంగడి మధుకర్ రెడ్డి దీనిని స్థాపించారు. సంస్థలో ఇప్పుడు ఆయనకు 13.75 శాతం వాటా ఉంది. ఇందులో 24.58 శాతం వాటాతో లావెండర్​ రోజ్ ఇన్వెస్ట్​మెంట్ ప్రధాన స్టేక్ హోల్డర్​గా ఉంది. ఆఫ్​లైన్​తోపాటు ఆన్​లైన్​లోనూ ఔషధాలు విక్రయిస్తుంది ఈ సంస్థ.


2020-21 ఆర్థిక సంవత్సరంలో మెడ్​ప్లస్​ రూ.63.11 కోట్ల లాభాన్ని గడించింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం రూ.1.79 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే రూ.66.36 కోట్ల లాభాన్ని నమోదు చేసిందని గణాంకాలు చెబుతున్నాయి.


Also read: Edible oil prices: మరింత తగ్గనున్న వంట నూనెల ధరలు!- కారణాలు ఇవే..


Also read: Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook