Edible oil prices: మరింత తగ్గనున్న వంట నూనెల ధరలు!- కారణాలు ఇవే..

Edible oil prices decline coming months: వంట నూనెల ధరలు మరింత దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయంగా నూనె గింజల పంట ఉత్పత్తి పెరగటం సహా అంతర్జాతీయంగా ధరల్లో తగ్గుదలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 09:56 AM IST
  • మరింత తగ్గనున్న వంట నూనెల ధరలు
  • దేశీయంగా పెరిగిన నూనె గింజల ఉత్పత్తి
  • వెల్లడించిన సాల్వెంట్ ఎక్స్​ట్రాక్టర్స్ అసోసియేషన్
Edible oil prices: మరింత తగ్గనున్న వంట నూనెల ధరలు!- కారణాలు ఇవే..

Edible oil prices decline coming months: వంట నూనెల ధరల మంట నుంచి గత నెల కొంత ఉపశమనం కలిగింది. కేజీ నూనె ధర గత నెలలో (Edible oil price down) రూ.8-10 వరకు దిగొచ్చింది. కేంద్రం వంట నూనెల దిగుమతిపై సుంకాలు తగ్గించడమే ఇందుకు కారణం.

రానున్న నెలల్లో వంట నూనె ధర కిలో రూ.3-4 వరకు తగ్గొచ్చనే అంచనాలు వస్తున్నాయి. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి (Oil Seed production) పెరగటం, అంతర్జాతీయ మార్కెట్లలో బేరీష్ ట్రెండ్​ ఇందుకు కలిసి రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎస్​ఈఏ నిర్ణయం.. కేంద్రం చొరవ..

'నవంబర్ ముందు వరకు దేశీయంగా వంట నూనెల ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలే ఇందుకు కారణం' సాల్వెంట్ ఎక్స్​ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్​ఈఏ) అధ్యక్షుడు అతుల్ చతుర్వేది తెలిపారు.

వంట నూనల ధరలు దిపావళికి ముందే తగ్గేలా చూడాలని.. ఎస్​ఈఏ (SEA on Cookin Oil prices) సభ్యులకు సూచించిన విషయాన్ని గుర్తు చేశారు ఛతుర్వేరది. ఇదే సమయంలో కేంద్రం కూడా చొరవ చూపించినట్ల వివరించారు. ఈ కారణంగా వినియోగదారులకు కాస్త భారం తగ్గిందన్నారు.

పెరిగిన పంట దిగుబడి..

దేశంలో 120 లక్షల టన్నుల సోయాబిన్​, 80 లక్షల టన్నుల వేరుశెనగ పంట (అదనంగా) ఉత్పత్తి అయినట్లు చెప్పారు చదుర్వేది. ఈ నేపథ్యంలో వంట నూనెల ధరలు మరోసారి సవరించే అవకాశమున్నట్లు చెప్పారు.

ఈ ఏడాది అత్యధికంగా 77.62 లక్షల హెక్టార్లలో మస్టర్డ్​ పంట పండినట్లు ఇది ఆల్​టైం హై అని చెప్పారు. ఈ కారణఁగా దేశంలోమస్టర్డ్ నూనె గతంతో పోలిస్తే.. 8 నుంచి 10 టన్నుల వరకు అధికంగా అందుబాటులో ఉంటుందని వివరించారు. సరిగ్గా ఇదే సమయంలో అంతర్జాతీయంగా కూడా వంట నూనెలపై బేరీష్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

దేశీయంగా వంట నూనె వినియోగం ఇలా..

దేశీయంగా ఏడాదికి 22-22.5 మిలియన్ టన్నుల వంట నూనె వినియోగం అవుతుండగా.. అందులో 65 శాతం దిగుమతి చేసుకుంటున్నదే కావడం గమనార్హం. అంటే 13-15 మిలియన్ టన్నులు వంట నూనెలు ప్రతి ఏటా దిగుమతి చేసుకుంటుంటగా.. మిగతాది దేశీయంగా ఉత్పత్తి అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

2019-20 మార్కెటింగ్ సంవత్సరంలో 13.2 మిలియన్ టన్నుల వంట నూనె దిగుమతి చేసుకుంది భారత్​. దీని విలువ రూ.71,600 కోట్లు. ఇక 2020-21 మార్కెటింగ్ సంవత్సరంలో పరిమాణలో పెద్దగా మార్పు లేకున్నా.. ఏకంగా రూ.1.17 లక్షల కోట్ల విలువైన వంటనూనెను దిగుమతి చేసుకున్నట్లు అధికారిక గణాంకాల్లో తేలింది. ధరల పెరుగదల ఏ స్థాయిలో ఉందో ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

Also read: LPG Booking Offer: పేటీఎంలో గ్యాస్ బుక్ చేస్తే రూ.2700 క్యాష్​బ్యాక్- పే లేటర్ ఆప్షన్​ కూడా!

Also read: Bank offers : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు బంఫర్ ఆఫర్.. 2 లక్షల వరకు ప్రయోజనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News