Meta Layoffs 2023: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. ఇప్పటికే 11 వేల మంది!
Facebook parent company Meta plans layoffs again. ఫేస్‌బుక్ మాతృసంస్థ `మెటా` మరోసారి లేఆఫ్స్ చేసే యోచనలో ఉందని పలు అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి.
Facebook parent company Meta plans fresh round layoffs: ఇటీవలి కాలంలో టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కంపెనీపై అదనపు భారాన్ని తొలగించుకుని నష్టాల నుంచి బయటపడేందుకే లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ మాతృసంస్థ 'మెటా' మరోసారి లేఆఫ్స్ చేసే యోచనలో ఉందని పలు అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. అందుకే వివిధ విభాగాలకు కేటాయించే బడ్జెట్‌లలో జాప్యం చేస్తోందని తెలుస్తోంది. అయితే లేఆఫ్స్ సంబంధించి ఇప్పటివరకూ మెటా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
నవంబరులో 11000 మంది ఉద్యోగుల్ని మెటా తొలగించింది. ప్రస్తుతం కూడా మరికొంత మందిని తీసేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈసారి ఎంత మందిని తొలగిస్తారనే దానిపై సరైన సమాచారం లేదు. బడ్జెట్లు, కొనసాగబోయే ఉద్యోగుల సంఖ్య విషయంలో కంపెనీలో అస్పష్టత నెలకొందని ఇద్దరు ఉద్యోగులు తెలిపినట్లు ఓ మీడియా తమ కథనంలో తెలిపింది. ఈ వార్తతో మెటా ఉద్యోగులు భయాందోళనలకు గురవవుతున్నారట. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. మెటా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
2023లో కంపెనీ సామర్థ్యాన్ని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నట్లు ఇటీవల ఓ ప్రకటనలో సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. మిడిల్ మేనేజర్లు, డైరెక్టర్లు కూడా పనిలో భాగస్వాములు కావాల్సిందేనని.. లేదంటే కంపెనీని వీడాల్సి ఉంటుందని చెప్పారు. కంపెనీలో మేనేజర్లను పర్యవేక్షించడానికి సైతం పైస్థాయి మేనేజర్లు ఉన్నారని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఇలా జుకర్‌బర్గ్ పరోక్షంగా తొలగింపుల విషయంలో సంకేతాలు ఇచ్చారు. ఆశించిన స్థాయిలో ఫలితాలు లేని ప్రాజెక్టులను సైతం మూసివేయనున్నట్లు మెటా ఇటీవల ప్రకటించింది.
గత కొంత కాలంగా టెక్ కంపెనీల్లో 2023లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 340 కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగుల్ని తొలగించాయి. మైక్రోసాఫ్ట్, ట్విటర్, స్విగ్గీ, అమెజాన్, గూగుల్, ఫిలిప్స్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవలే టిక్‌టాక్ ఇండియా భారత్‌లోని తమ ఉద్యోగును తొలగించింది. యాహూ 1600 మందిని, డెల్ 6500 మందిన ఇంటికి పంపాయి. ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయించే ఓఎల్ఎక్స్‌లో కూడా తొలగింపులకు సిద్దమైనట్టు సమాచారం తెలుస్తోంది.
Also Read: AUS vs IND: నా ముఖం కాదు రా బాబు.. ముందు రీప్లే చూపించు! కెమెరామెన్‌పై రోహిత్ శర్మ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.