Upcoming Cars In India: భారత మార్కెట్‌లోని 3 పురాతన కార్లు.. బుకింగ్ కూడా మొదలైంది! ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అంబాసిడర్‌

Old Legendary Cars Tata Sierra, Hindustan Ambassador Coming Back. కొన్ని కార్ల సంస్థలు ప్రముఖ కార్లను మార్కెట్లోకి వెనక్కి తీసుకొచ్చే పనిలో ఉన్నాయి.  ఈ కార్ల కోసం కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 12, 2023, 03:34 PM IST
  • భారత మార్కెట్‌లోని 3 పురాతన కార్లు
  • బుకింగ్ కూడా మొదలైంది
  • ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అంబాసిడర్‌
Upcoming Cars In India: భారత మార్కెట్‌లోని 3 పురాతన కార్లు.. బుకింగ్ కూడా మొదలైంది! ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అంబాసిడర్‌

Old Legendary Cars Tata Sierra, Hindustan Ambassador Coming Back: భారత మార్కెట్‌లోని ప్రతి కార్ కంపెనీ నిరంతరం కొత్త కొత్త మోడల్స్ తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం ఎలట్రానిక్ కార్ల హవా నడుస్తుండంతో.. కంపెనీలు ఆ దిశగా ముందుగా సాగుతున్నాయి. అయితే కొన్ని కార్ల సంస్థలు ప్రముఖ కార్లను వెనక్కి తీసుకొచ్చే పనిలో ఉన్నాయి. టాటా మోటార్స్ కొంతకాలం క్రితం తన టాటా సఫారీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. అదేవిధంగా అనేక ఇతర వాహనాలు కూడా మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ కార్ల కోసం కొనుగోలుదారులు భారతదేశంలో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. 

 హిందుస్థాన్ అంబాసిడర్, టాటా సియెర్రా, హిందుస్థాన్ కాంటెస్సా, మారుతీ 800, మారుతీ ఓమ్నీ, మారుతీ జిప్సీ వంటి కార్లు మార్కెట్‌లోకి మరలా రానున్నాయి. అయితే ఈ వాహనాలన్నీ ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడవు. ఇందులో మూడు కార్లు ఇండియాలో పునరాగమనం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ మూడు కార్ల వివరాలను ఓసారి చూద్దాం. 

Hindustan Ambassador: 
ఒకప్పుడు భారతీయ రోడ్లపై అంబాసిడర్‌ కారు రారాజుగా పరిగణించబడేది. ఈ ఫ్యామిలీ సెడాన్‌ కారును సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఉపయోగించేవారు. ఇప్పుడు కూడా ఈ కారును రాజకీయ నాయకుల వద్ద చూడవచ్చు. ఈ కారు 1956 నుంచి 2014 వరకు విక్రయించబడింది. ఈ కారు త్వరలో భారత్‌లో పునరాగమనం చేయనుందని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అంబాసిడర్‌ను తీసుకురానున్నారట.

Tata Sierra: 
టాటా సియెర్రా భారతదేశపు మొట్టమొదటి ఎస్యూవీ. 1991 సంవత్సరంలో ఈ కారు ప్రారంభించబడింది. 2003లో కంపెనీ దీనిని నిలిపివేసింది. ఇప్పుడు టాటా మోటార్స్ ఈ కారుని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తిరిగి తీసుకొచ్చింది. గత నెలలో ఇది ఆటో ఎక్స్‌పో 2023లో ప్రవేశపెట్టబడింది. త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది. టాటా సియెర్రా ఎలక్ట్రిక్‌లో 40.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 437 కిమీ వెళ్లొచ్చు. 

Maruti Gypsy:
మారుతి జిప్సీ స్థానంలో కంపెనీ మారుతి జిమ్నీని భారతదేశంలోకి తీసుకువచ్చింది. ఈ ఎస్యూవీ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన కూడా వస్తోంది. మారుతి నుంచి వచ్చిన మొదటి 4X4 కారు జిమ్నీ. దీన్ని భారత్‌లో తయారు చేసి విదేశాల్లో విక్రయించనున్నారు. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆధారంగా వస్తోంది. ఈ కారు 5 డోర్‌లను కలిగి ఉంది.

Also Read: AUS vs IND: నా ముఖం కాదు రా బాబు.. ముందు రీప్లే చూపించు! కెమెరామెన్‌పై రోహిత్ శర్మ ఫైర్  

Aslo Read: AUS vs IND: ఆస్ట్రేలియా ఓటమికి అసలు కారణం అదే.. వీరేందర్ సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News