Whatapp New Feature: వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టబోతోంది. ఇప్పుడిక ఇన్‌స్టా యూజర్లకు ఉన్న అవతార్ ఫీచర్..వాట్సప్ యూజర్లకు కూడా అందుబాటులో రానుంది. అవతార్ ఫీచర్ ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూ యూజర్లను ఆకట్టుకుంటోంది. మెటా గొడుగులో ఉన్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ సోషల్ మీడియా వేదికల యూజర్లకు కొత్త అనుభూతి అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 2021 ఫిబ్రవరి నెలలో ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం కొత్తగా అవతార్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను త్వరలో వాట్సప్ యూజర్లకు కూడా కంపెనీ అందుబాటులో తీసుకురానుంది. ఈ ఫీచర్ వీడియోకాల్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉంది. త్వరలో అందుబాటులో రానుందని వాట్సప్ కమ్యూనిటీ బ్లాగ్ బీటా ఇన్ఫో తెలిపింది. 


అవతార్ ఫీచర్ ప్రత్యేకతలేంటి


యూజర్ల వీడియో కాల్ చేసేటప్పుడు స్క్రీన్‌పై స్విచ్ టు అవతార్ ఆప్షన్ కన్పిస్తుంది. ఈ ఫీచర్‌పై క్లిక్ చేస్తే..యూజర్ ప్రొఫైల్ ఫోటో స్థానంలో యానిమేటెడ్ అవతార్ ప్రత్యక్షమవుతుంది. వీడయో కాల్ చేస్తూనే..ప్రొఫైల్ పిక్ స్థానంలో యానిమేటెడ్ అవతరార్ పిక్స్ రీప్లేస్ చేయవచ్చు. ఈ పిక్స్ 2డీ, 3డీ రూపంలో ఉండి యూజర్లకు వీడియో కాలింగ్ విషయంలో మంచి అనుభూతిని కల్పిస్తాయి. 


మరోవైపు నకిలీ ఖాతాలపై వాట్సప్ ఉక్కుపాదం మోపుతోంది. వాట్సప్ ద్వారా జరిగే మోసాలు, వేధింపుల్ని అరికట్టేందుకు వాట్సప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తోంది. ఇప్పటివరకూ ఉన్న వ్యవస్థ ప్రకారం యూజర్ల నిబంధనలు అతిక్రమించకపోయినా..ఇతర యూజర్ల నుంచి ఫిర్యాదులు అందింతే ఎక్కౌంట్ రిమూవ్ చేస్తుంది.ఇలాంటి యూజర్ల కోసం ఎక్కౌంట్ పునరుద్ధరణకై విజ్ఞప్తి చేసేందుకు కొత్త ఫీచర్ అందుబాటులో రానుంది. అయితే కొన్ని ఆధారాలు సమర్పించిన తరువాతే..వాట్సప్ ఆ ఖాతాల్ని రెన్యువల్ చేస్తుంది. 


Also read: PSLV C53 Launch: నింగిలోకి విజయవంతంగా పీఎస్ఎల్వీ సీ 53 ప్రయోగం, ఇస్రో మరో ఘనత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook