MG Comet EV Bookings: ఎంజీ కామెట్ ఈవీ బుకింగ్స్ మొదలు.. మొదటి 5000 మందికి బంపర్ ఆఫర్!
MG Comet EV booking amount and Introductory Price. కామెట్ ఈవీ బుకింగ్స్ ను ఎంజీ మోటార్ ప్రారంభించింది. దేశంలోనే అతి చౌకైన ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని రూ. 11వేల టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు.
MG Comet EV booking amount and Introductory Price: భారత దేశ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో 'ఎంజీ కామెట్' ఈవీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కామెట్ ఈవీ బుకింగ్స్ ను ఎంజీ మోటార్ ప్రారంభించింది. దేశంలోనే అతి చౌకైన ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని రూ. 11వేల టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. కస్టమర్ల కోసం టెస్ట్ డ్రైవ్ 202 ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు డెలివరీ ఈ నెలాఖరులో ప్రారంభమవుతుంది. రెండు-డోర్ల ఎంజీ కామెట్ మూడు వేరియంట్‌లలో (పేస్, ప్లే మరియు ప్లష్) అందుబాటులో ఉంటుంది ఈ కారు ధర వరుసగా రూ. 7.78 లక్షలు, రూ. 9.28 లక్షలు మరియు రూ. 9.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)లుగా ఉంది. ఈ ధరలు మొదటి 5000 మంది కస్టమర్లకు మాత్రమే. తర్వాతి వారికి ఈ ధరలు పెంచే అవకాశం ఉంది.
కొత్త ఎంజీ కామెట్ ఈవీ 17.3kWh బ్యాటరీ ప్యాక్ మరియు 42bhp/110Nm ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ IP67-రేటెడ్ మరియు ARAI ఉండగా.. 230 కిలోమీటర్ల ప్రయాణంను అందిస్తుంది. కంపెనీ ఈ కారుని 3.3kW ఛార్జర్‌తో అందిస్తోంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 7 గంటలు పడుతుంది. కామెట్ ఈవీ కోసం బ్యాటరీ ప్యాక్ టాటా ఆటోకాంప్ నుంచి తీసుకోబడింది. దీని నిర్వహణ ఖర్చు నెలకు రూ.519 అని ఎంజీ చెబుతోంది.
ఎంజీ కామెట్ ఈవీ పొడవు 2974mm, వెడల్పు 1505mm మరియు ఎత్తు 1640mmగా ఉంది. దీని వీల్ బేస్ 2010 మిమీ. ఈ ఎలక్ట్రిక్ కారు లోపలి భాగం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్‌లు (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం), వైర్‌లెస్ Apple CarPlay మరియు Android Auto, కీలెస్ ఎంట్రీ, మూడు USB పోర్ట్‌లు, iPod-శైలి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లు ఉన్నాయి. రోటరీ డ్రైవ్ సెలెక్టర్ వంటి అనేక ఫీచర్లు ఈ కారు మధ్యలో అందుబాటులో ఉన్నాయి. ఈ కారు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, రివర్స్ కెమెరా మరియు సెన్సార్లు ఉన్నాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది.
ఎంజీ కామెట్ ఈవీ ఐదు రంగు ఎంపికలలో వస్తుంది. తొలి 5 వేల బుకింగ్స్‌కు మాత్రమే ఇంట్రొడక్టరీ ప్రైజ్ వర్తిస్తుందని ఎంజీ స్పష్టం చేసింది. అందుకే ఆసక్తి ఉన్న వారు ఈ ఈవీని వెంటనే బుక్ చేసుకోండి. సంస్థ అధికారి వెబ్సైట్ లేదా సమీప డీలర్షిప్ షోరూమ్‌లో ఎంజీ కామెట్ ఈవీని బుక్ చేసుకోవచ్చు. 5 వేల బుకింగ్స్ తర్వాత ఈ కారు ధర కచ్చితంగా పెరుగుతుంది. టాటా మోటార్స్ కూడా టియాగో ఈవీకి ఇలానే ఆఫర్స్ పెట్టింది. తొలుత ఇంట్రొడక్టరీ ప్రైజ్ ప్రకటించి.. ఆపై వాహన ధరలను దాదాపు రూ. 70వేల వరకు పెంచింది.
Also Read: Nitish Rana Fine: గెలిచిన ఆనందంలో ఉన్న కేకేఆర్‌కు భారీ షాక్.. ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరికీ కోత!
Also Read: Telangana Temperature: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.