MG Motor India said that it will "drive" an electric vehicle priced between Rs 10-15 lakh: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్స్​ ఇండియా (MG Motors India).. దేశీయంగా మరో విద్యుత్ కార్​ను (ఈవీ) విడుదల చేసేందుకు కసరరత్తు చేస్తోంది. అయితే ఈ సారి బడ్జెట్​ ధరలో కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని ఎంజీ మోటార్స్ భావిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నూతన ఎలక్ట్రిక్ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య (MG Budget Electrice car) ఉండనుంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించడం గమనార్హం.


ప్రస్తుతం ఎంజీ ఎలక్ట్రిక్ కారు ధర ఎంతంటే..


ఎంజీ మోటార్స్ ప్రస్తుతం ఎస్​యూవీ 'ZS EV' ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధరను (ZS EV price) రూ.21 లక్షల నుంచి రూ.24.68 లక్షల మధ్య (ఎక్స్​ షోరూం) ఉంచింది.


ప్రస్తుతం ఈ కంపెనీ గ్లోబల్ ప్లాట్​ఫామ్​ను ఆధారంగా చేసుకుని కొత్త కార్లను విడుదల చేస్తుంది. అయితే భారత మార్కెట్​కు, దేశీయ వినియోగదారుల అభిరుచులకు అనుగునంగా వాటిల్లో మార్పులు చేసి.. కొత్త మోడల్​గా వాటిని విడుదల చేస్తోంది. ఇప్పటికే కొత్త మోడల్​ కోసం ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది కంపెనీ.


దేశీయ మార్కెట్లోకి ఎస్​యూవీ అస్టోర్​తో మంచి సేల్స్​ను సాధించింది ఎంజీ మోటార్స్. దీనితో జోరుమీదున్న ఈ కంపెనీ.. ప్రస్తుతం ఈవీలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకం (పీఎల్​ఐ) పథకం ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభిస్తున్న నేపథ్యంలో ఈవీలే ప్రధాన వృద్ధి మార్గంగా భావిస్తున్నట్లు వివరించింది. కొత్త ఈవీ వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విడుదల చేసే అవకాశమున్నట్లు వివరించింది.


ఆ కార్ల పోటీగా..


దేశంలో దిగ్గజ వాహన తయారీ కంపెనీలుగా ఉన్న టాటా విద్యుత్ వాహనాలకు పోటీ ఇచ్చేందుకు ఎంజీ మోటార్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బడ్జెట్​ ధరలో కొత్త కారును తీసుకురానుందని సమాచారం. ముఖ్యంగా టాటా నెక్సాన్​, టిగోర్ ఈవీలకు ఈ ఎంజీ మోటార్స్ మోడల్స్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.


Also read: Amazon iPhone XR Sale: రూ.18,599లకే Apple iPhone మీ సొంతం చేసుకోండిలా!


Also read: Metro Brands IPO: నేటి నుంచే మెట్రో బ్రాండ్స్ ఐపీఓ- షేరు ధర ఎంతంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook