Amazon iPhone XR Sale: రూ.18,599లకే Apple iPhone మీ సొంతం చేసుకోండిలా!

Amazon iPhone XR Sale: భారత ఈ-కామర్స్ దిగ్గజం.. వినియోగదారుల కోసం మరో ఆసక్తికరమైన ఆఫర్ ను వెబ్ సైట్ లో ఉంచింది. Apple iPhone XRని కేవలం రూ.20 వేల ధర కంటే తక్కువగా విక్రయిస్తుంది. అయితే అందుకు కొన్ని ఆఫర్లను జత చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ ఆఫర్ల వివరాలేమిటో తెలుసుకుందామా?

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 11:33 AM IST
Amazon iPhone XR Sale: రూ.18,599లకే Apple iPhone మీ సొంతం చేసుకోండిలా!

Amazon iPhone XR Sale: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లను వినియోగదారుల ముందు ఉంచింది. Apple iPhone XRని కేవలం రూ.18,599 లకే అందుబాటులో ఉంచింది. అయితే ఈ ధరను పొందాలంటే కొన్ని ఆఫర్లను కలుపుకొని ఈ మొబైల్ ను కొనుగోలు చేయాల్సి ఉంది.

Apple iPhone XR బేస్ వేరియంట్ (64 జీబీ) ప్రస్తుతం అమెజాన్ లో రూ.34,999 ధరకు విక్రయిస్తున్నారు. దానికి అదనంగా, ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా రూ.14,900 డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.   

దీంతో పాటు యస్ బ్యాంక్ లేదా అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డ్ ల నుంచి EMI ద్వారా లావాదేవీని చేస్తే, అదనంగా రూ.1500 తగ్గింపు పొందొచ్చు. దాంతో దాదాపు రూ.35 వేల విలువ కలిగిన ఐఫోన్ కేవంల రూ. 18,599 లకే మీ సొంతం అవుతుంది!

iPhone XRపై అమెజాన్ లో ఆఫర్లు..

1) ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా అత్యధికంగా రూ.14,900 తగ్గింపు లభించే అవకాశం.

2) ఎంపిక చేసిన కార్ట్ లపై నో కాస్ట్ EMI అందుబాటులో ఉంటుంది.

బ్యాంకు ఆఫర్లు: 1) సిటీ యూనియన్ బ్యాంక్ డెబిట్ మాస్టర్ కార్డ్ లావాదేవీలపై ఫ్లాట్ రూ.1500 తక్షణ తగ్గింపు.

2) అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 1500 తక్షణ తగ్గింపు (7.5% డిస్కౌంట్).

3) యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 1500 తక్షణ తగ్గింపు.

4) HSBC క్యాష్‌బ్యాక్ కార్డ్ లావాదేవీలపై 5% తక్షణ తగ్గింపు. 

iPhone XR వేరియంట్ 2018లో  భారతీయ మార్కెట్లలోకి ప్రవేశించింది. 64 GB, 128 GB, 256 GB స్టోరేజ్ వేరియంట్స్ తో నలుపు, నీలం, పసుపు, పగడపు, ఎరుపు రంగులలో లభిస్తుంది. Apple iPhone XR లో లిక్విడ్ రెటినా డిస్ ప్లేతో కూడిన 6.1 అంగుళాల LCD స్క్రీన్, స్టీల్ కు బదులుగా అల్యూమినియం బాడీని కలిగి ఉన్నాయి. 

 

Also Read: PM Kisan Yojana: రైతులకు గుడ్ న్యూస్- ఈ నెల 25 లోపు ఖాతాల్లో రూ.2 వేలు!

Also Read: Bank holidays: వచ్చే వారం 4 రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News