Buy Hyundai Exter @ Rs 6 Lakhs: రూ. 6 లక్షలకే హ్యుండయ్ నుంచి కొత్త మైక్రో SUV.. చీప్ అండ్ బెస్ట్
Get Hyundai Exter @ 6 Lakhs Rupees: ఇండియన్ కార్ మార్కెట్‌లో వివిధ రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో మైక్రో ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. మారుతి, టాటా మోటార్స్ తరువాత ఇప్పుడు హ్యుండయ్ కూడా మైక్రో ఎస్‌యూవీ లాంచ్ చేస్తోంది. ఫలితంగా హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఆదరణ తగ్గుతోంది.
Get Hyundai Exter @ Rs 6 Lakhs Rupees: భారతీయ మార్కెట్‌లో గత కొద్దికాలంగా 5 సీటర్ కార్లలో మైక్రో ఎస్‌యూవీ కార్లకు ఆదరణ పెరుగుతోంది. మారుతి సుజుకి ఇప్పటికే ఎస్‌ప్రెసో లాంచ్ చేయగా, టాటా మోటార్స్ టాటా పంచ్ ప్రవేశపెట్టింది. ఇప్పుడిక హ్యుండయ్ ఎక్స్‌టర్ ఎంట్రీ ఇవ్వబోతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుండయ్ గ్రాండ్ ఐ10 కొనే ఆలోచన ఉంటే..కాస్త ఆలోచించండి. అదే ధరకు అద్భుతమైన ఎస్‌యూవీ కేవలం 6 లక్షలకే 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో మైక్రో ఎస్‌యూవీ అందుబాటులో రానుంది. అదే హ్యుండయ్ ఎక్స్‌టర్. త్వరలో మార్కెట్‌లో ఎంట్రీ ఇస్తోంది. మైక్రో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ కారణంగా హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్మకాల్లో కాస్త వెనకబడుతున్నాయనే చెప్పవచ్చు.
ఎందుకంటే హ్యాచ్‌బ్యాక్ కార్ల ధరకే కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లు లభిస్తున్నాయి. మైక్రో ఎస్‌యూవీలపై క్రేజ్ పెరగడానికి కారణం స్పేస్ ఎక్కువగా ఉండటం, సౌకర్యవంతంగా ఉండటం, గ్రౌండ్ క్లియరెన్స్ వంటివి హ్యాచ్‌బ్యాక్ కార్లతో పోలిస్తే బాగుంటాయి. ఎత్తైన సీటింగ్ కారణంగా ఎస్‌యూవీ అనుభూతి కలుగుతుంది. అందుకే మైక్రో ఎస్‌యూవీలకు క్రేజ్ పెరుగుతోంది. మైక్రో ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి ఎస్‌ప్రెసో, టాటా పంచ్‌లకు దీటుగా హ్యుండయ్ ఎక్స్‌టర్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ధర కూడా మారుతి స్విఫ్ట్, గ్రాండ్ ఐ10 నియోస్ ఎంత ఉందో అంతే ఉంటుంది.
Also Read: Smartphones Under Rs 20K: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉన్న ప్రీమియం స్మార్ట్ ఫోన్స్
హ్యుండయ్ ఎక్స్‌టర్‌లో సేఫ్టీకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. దీంతో పాటు పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో టైర్ ప్రెషర్, ఓడోమీటర్ రీడింగ్, డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి కీలకమైన వివరాలు కన్పిస్తుంటాయి. ఇక వీటితో పాటు మరో అద్భుతమైన ఫీచర్ వాయిస్ కమాండ్. వాయిస్ కమాండ్ ఆధారంగా సన్‌రూఫ్, ఏసీ పనిచేస్తాయి. వాయిస్ కమాండ్ ఇస్తే ఏసీ టెంపరేచర్ తగ్గడం, పెరగడంతో పాటు సన్‌రూఫ్ తెర్చుకోవడం, మూసుకోవడం ఉంటాయి.
హ్యుండయ్ ఎక్స్‌టర్‌లో డ్యూయల్ డ్యాష్‌క్యామ్ ఉంటుంది. ఇది పూర్తిగా హెచ్‌డి వీడియో రిసొల్యూషన్‌తో ఉంటుంది. యూజర్లు ఫంట్ అంట్ రేర్ రెండు కెమేరాలతో ఫోటోలు తీసుకోవచ్చు. ఇక ధర చూస్తే చాలా తక్కువే. హ్యుండయ్ ఎక్స్‌టర్ ఇండియాలో జూలై 10వ తేదీన లాంచ్ కానుంది. ప్రారంభధర 6 లక్షల రూపాయల్నించి ఉండవచ్చు. ఇండియన్ మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్, రీనాల్ట్ కైగర్, నిస్సాన్ మేగ్నైట్‌తో పోటీ ఉంటుంది. అందుకే స్విఫ్ట్ లేదా గ్రాండ్ ఐ10 కొనే ఆలోచన ఉంటే కాస్త ఆలోచించి హ్యుండయ్ ఎక్స్‌టర్ తీసుకోవడం మంచదనేది నిపుణుల సూచన. ఎందుకంటే ఇది మైక్రో ఎస్‌యూవీ. హ్యాచ్‌బ్యాక్ ధరకు మైక్రో ఎస్‌యూవీ లభించడం మంచిదే కదా.
Also Read: Hyundai Venue: హ్యుండయ్ వెన్యూ కొత్త వేరియంట్ లాంచ్, ఈ మూడు ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook