Microsoft Company Record: ప్రముఖ ఐటీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ అరుదైన ఘనత సాధించింది. వాణిజ్యరంగంలో మైక్రోసాఫ్ట్ బ్రాండ్ వాల్యూ నిలబెట్టింది. మార్కెట్ కేపిటల్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మైక్రోసాఫ్ట్ కంపెనీ (Microsoft) ఇప్పుడు దూసుకుపోతోంది. ఆపిల్ కంపెనీ తరువాత అంతటి ఘనత సాధించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ మార్కెట్ కేపిటల్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు ( 2 Trillion Dollars) చేరి కొత్త రికార్డు సాధించింది. అమెరికాలో 2 ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన రెండవ కంపెనీగా మైక్రోసాఫ్ట్ ఖ్యాతినార్జించింది. క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ విభాగాల్లో కంపెనీ తన ఆధిపత్యాన్ని మరింతగా పెంచుకుంది. అటు కంపెనీ షేర్లు కూడా 1.2 శాతం పైకి ఎగిశాయి. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కంపెనీ షేర్ విలువ(Microsoft Share Value) 266.34 డాలర్లుగా ఉంది.


2014లో సత్య నాదెళ్ల (Satya Nadella) మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కంపెనీ ఆధిపత్యం కొనసాగుతోంది. గత ఏడేళ్ల నుంచి కంపెనీ షేర్ వ్యాల్యూ పరుగులు పెడుతోంది. క్లౌడ్ టెక్నాలజీ, మొబైల్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో దిగ్గజ కంపెనీలతో పోటీ పడుతోంది. కంపెనీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందున సత్య నాదెళ్ల ఇటీవలే కంపెనీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అమెరికన్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్ బిల్లుల నుంచి తప్పించుకున్న అతిపెద్ద యూఎస్ కంపెనీగా నిలిచింది. కంపెనీ విస్తరణలో భాగంగా త్వరలో స్పెయిన్‌లో డేటా సెంటర్(Data Centre) ఏర్పాటు కానుంది. 


Also read: Gold Price In Hyderabad 23 June 2021: మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook