Microsoft employees to get COVID-19 pandemic bonus: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కుని సంస్థ అభివృద్ధికి కృషి చేసినందుకుగాను తమ కంపెనీ సిబ్బందికి ఒక్కొక్కరికి 1,500 డాలర్లు కరోనావైరస్ ప్యాండెమిక్ బోనస్‌గా అందించనున్నట్టు మైక్రోసాఫ్ట్ (Microsoft's Corona bonus) ప్రకటించింది. అంటే భారతీయ కరెన్సీలో లక్ష 12 వేల రూపాయలు అన్నమాట. కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ కంటే కింది స్థాయి సిబ్బందికి ఈ కరోనా బోనస్ బెనిఫిట్ అందనుంది. గంటల ప్రకారం పనిచేస్తున్న పార్ట్‌టైమ్ వర్కర్స్‌కి సైతం ఈ కరోనా ప్యాండెమిక్ బోనస్ లభించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కత్లీన్ హోగన్ సంస్థ సిబ్బందికి కొవిడ్ ప్యాండెమిక్ బోనస్ గురించి ప్రకటిస్తూ.. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ సిబ్బంది మొత్తం ఈ బోనస్‌కి అర్హులు అవుతారు అని తెలిపారు. మైక్రోసాఫ్ట్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 1,75,508 సిబ్బంది సేవలు అందిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థలైన లింక్డ్‌ఇన్, గిట్‌హబ్, జెనిమ్యాక్స్ (LinkedIn, GitHub and ZeniMax) వంటి కంపెనీల సిబ్బందికి కరోనా ప్యాండెమిక్ బోనస్ వర్తించదు అని మైక్రోసాఫ్ట్ తెలిపింది.


Also read: Kappa variant cases: ఉత్తర్ ప్రదేశ్‌లో కప్ప వేరియంట్ కేసులు


కరోనా వైరస్ ప్యాండెమిక్ (COVID-19) బోనస్ కోసం దాదాపు 200 మిలియన్ డాలర్లు వెచ్చిస్తున్న మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఇది రెండు రోజుల లాభం కంటే తక్కువే. గతంలో ఫేస్‌బుక్ తమ సంస్థలో పనిచేసే 45 వేల మంది సిబ్బందికి ఒక్కొక్కరికి 1000 డాలర్లు (Facebook holiday bonus) బోనస్‌గా అందించగా.. అమేజాన్ కూడా తమ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 300 డాలర్ల చొప్పున హాలీడే బోనస్ (Amazon holiday bonus) అందించిన సంగతి తెలిసిందే.


Also read : Hassani Dotson Stephenson proposes girlfriend Petra Vuckovic: మైదానంలోనే గాళ్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసి, ముద్దిచ్చిన ఆటగాడు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook