Elon Musk: ఆ వ్యాపారం కూడా చేస్తే ఇక ఎవరూ ఎలాన్ మస్క్‌ను టచ్ చేయలేరట
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇతడి గురించే చర్చ. ప్రపంచమంతా ఇప్పుడితడిని ఫాలో అవుతోంది. భారత పారిశ్రామిక దిగ్గజాలు కూడా అతడి విజయాన్ని సమీక్షిస్తున్నాయి. ఇప్పుడు మరో ప్రపంచ విఖ్యాత అనలిస్ట్ సైతం ప్రశంసలు కురిపించారు.
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇతడి గురించే చర్చ. ప్రపంచమంతా ఇప్పుడితడిని ఫాలో అవుతోంది. భారత పారిశ్రామిక దిగ్గజాలు కూడా అతడి విజయాన్ని సమీక్షిస్తున్నాయి. ఇప్పుడు మరో ప్రపంచ విఖ్యాత అనలిస్ట్ సైతం ప్రశంసలు కురిపించారు.
స్పేస్‌ఎక్స్ , టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk)ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు. ప్రపంచ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో చేరాక అతడి అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఎక్కడ విన్నా ఎలాన్ మస్క్ గురించే చర్చ సాగుతోంది. ఎలాన్ మస్క్ విజయ రహస్యంపై చర్చించుకుంటున్న పరిస్థితి. ప్రపంచమంతా అతడిపై ఫోకస్ పెడుతోంది. భారత దిగ్గజ పారిశ్రామిక వేత్తలైన ఆనంద్ మహీంద్రా, హర్ష్ గోయెంకాలు సైతం ఎలాన్ మస్క్ విజయంపై సమీక్ష చేస్తున్నారు. ఇప్పుడు మరో ప్రపంచ విఖ్యాత అనలిస్ట్ సైతం ఎలాన్ మస్క్‌పై ప్రశంసలు కురిపించాడు. అదేంటో పరిశీలిద్దాం.
అమెరికా బ్యాంకింగ్ దిగ్గజంగా పేరున్న మోర్గాన్ స్టాన్లే(Morgan Stanley)ఎలాన్ మస్క్ సంపాదనపై ఓ ఆసక్తికర కథనం విడుదల చేసింది.టెస్లా కంపెనీతో కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఎలాన్ మస్క్..స్పేస్‌ఎక్స్ కంపెనీతోనే ఖ్యాతిని, సంపదను మరింతగా పెంచుకునే అవకాశముందని మోర్గాన్ స్టాన్లేకు చెందిన ఓ ప్రముఖ అనలిస్ట్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. SpaceX Escape Velocity..Who Can Catch them ? పేరుతో మోర్గాన్ స్టాన్లేకు చెందిన ఆడమ్ జోన్స్ ఓ కథనం రాశాడు. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్(Bloomberg Index) ప్రకారం ఎలాన్ మస్క్ మొత్తం సంపాదన 241.4 బిలియన్ డాలర్లలో స్పేస్‌ఎక్స్(SpaceX)17 శాతం వాటా కలిగి ఉంది. ఒకవేళ ఎలాన్ మస్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దృష్టి సారిస్తే కేవలం స్పేస్ఎక్స్ ద్వారానే 2 వందల బిలియన్ డాలర్లు సంపాదించవచ్చని అభిప్రాయపడ్డాడు. అలా చేస్తే భూమ్మీద తొలి ట్రిలియనీర్‌గా(Elon musk first Trillionaire)ఎలాన్ మస్క్ ఎదిగే అవకాశముందని..దరిదాపుల్లో అతడిని టచ్ చేసే ధమ్ము లేదా అవకాశం ఉండదని ఆ కథనం సారాంశం. మోర్గాన్ స్టాన్లేకు ఎలాన్ మస్క్‌కు మధ్య విభేదాలున్న నేపధ్యంలో ఈ కథనం వెలువడటం విశేషం.
Also read: Gold Demand: 2022 నాటికి బంగారం డిమాండ్ భారీగా పెరగనుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి