Tata Nexon SUV Car Prices: దేశంలో అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్న ఎస్‌యూవి కార్ల జాబితాలో టాటా నెక్సాన్ కారు గ్రాఫ్ క్రమక్రమంగా పైపైకి వెళ్తోంది. ఎస్‌యూవీ కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య ఎలాగైతే పెరుగుతుందో.. అలాగే టాటా నెక్సాన్ ఎస్‌యూవి కార్ల వైపు చూస్తున్న వారి సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. 2022లో ఒక్క నవంబర్‌ నెలలోనే SUV కార్ల విభాగంలో టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. నవంబర్ నెలలో మొత్తం 15,871 యూనిట్ల టాటా నెక్సాన్ కార్లు అమ్ముడయ్యాయి. నవంబర్ నెలలో టాటా నెక్సాన్ కార్లకు డిమాండ్ పెరగడంతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన రెండో ఎస్‌యూవి కారుగానూ టాటా నెక్సాన్ పేరు సొంతం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా నెక్సాన్ తర్వాత మొత్తం 13,321 యూనిట్లు హ్యుందాయ్ క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. దీంతో నవంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్ యూవి కార్ల విభాగంలో హ్యుందాయ్ క్రెటా కారు రెండవ స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానంలో మళ్లీ టాటా మోటార్స్ తయారు చేసిన టాటా పంచ్ కారు నిలవడం విశేషం. అవును.. నవంబర్ 2022లో ఇండియాలో 12,131 యూనిట్ల కార్ల అమ్మకాలతో టాటా పంచ్ కారు మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఎస్‌యూవి కార్ల విభాగంలో మారుతీ సుజుకి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదే నవంబర్ నెలలో మారుతి సుజుకి బ్రెజ్జా మొత్తం 11,324 యూనిట్ల కార్లు విక్రయాలు జరిగాయి. ఇక హ్యుందాయ్‌లో ఎస్‌యూవి కేటగిరికి చెందిన హ్యుందాయ్ వెన్యూ కారు 10,738 యూనిట్ల కార్ల విక్రయాలతో ఐదవ స్థానంలో నిలిచింది.


మారుతీ, మహీంద్రా కంపెనీలకు చెమటలు పట్టించిన టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ మారుతి, మహింద్రా కంపెనీలకు నిద్ర కరువయ్యేలా చేస్తోందంటున్నారు ఆటోమొబైల్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్. నవంబర్ నెల గణాంకాల ప్రకారం అమ్మకాల పరంగా మారుతి, మహింద్రా కంపెనీలకు చెందిన ఎస్‌యూవి కార్లను వెనక్కు నెడుతూ టాటా నెక్సాన్ ముందుకు దూసుకుపోతున్న తీరు మారుతి, మహీంద్రా కంపెనీలతో సహా అన్ని కార్ల తయారీదారులకు చెమటలు పట్టించిందంటున్నారు ఆటోమొబైల్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్. 


టాటా నెక్సాన్ ధరలు ఎలా ఉన్నాయంటే..
టాటా నెక్సాన్ కార్ల బేసిక్ వేరియంట్ ఎస్‌యూవి కార్ల ధర రూ. 7.60 లక్షల నుండి హై ఎండ్ మోడల్ ధర రూ. 13.95 లక్షల వరకు పలుకుతోంది. 5 సీట్లు కలిగిన టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.


టాటా నెక్సాన్ కారు ఇంజన్ స్పెసిఫికేషన్స్, మైలేజ్ వివరాలు
టాటా నెక్సాన్ 1.2 లీటర్, 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ 110PS/170Nm లో లభిస్తుండగా.. 1.5-లీటర్, 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ వేరియంట్ 110PS/260Nm తో లభిస్తోంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ సిస్టం కలిగిన టాటా నెక్సాన్ డీజిల్‌పై 21.5 kmpl, పెట్రోల్‌పై 17.2 kmpl మైలేజ్ ఇచ్చే సామర్థ్యం కలదు. వీటికి తోడు సేఫ్టీ పరంగా టాటా కార్లకు ఉండే ఇమేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇవన్నీ టాటా నెక్సాన్ కార్లకు డిమాండ్ పెరిగేలా చేస్తోంది.


ఇది కూడా చదవండి : RDE Norms in New Cars: ఈ కార్లను కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి బ్యాడ్ న్యూస్


ఇది కూడా చదవండి : Cheap Hyundai Creta Cars: రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్ లేదు.. రూ. 7 లక్షలకే హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లండి!


ఇది కూడా చదవండి : Cheapest Honda City Cars: రూ. 5.33 లక్షలకే హోండా సిటీ కారు.. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్ కూడా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook