Motorola Moto G51 mobile specs, price: మోటోరోలా మొబైల్ బ్రాండ్ నుంచి త్వరలోనే మరో స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అవనుంది. మోటోరొలా మోటో జి51 మొబైల్ పేరిట డిసెంబర్ 10న లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి మోటోరోలా తాజాగా పలు వివరాలు వెల్లడించింది. ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా లాంచ్ కానున్న ఈ మోటో జి51 మొబైల్ ఆ తర్వాతి నుంచి ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌తో పాటు మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో లభ్యం కానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోటోరోలా వెల్లడించిన వివరాల ప్రకారం.. 12 వరకు 5G యాక్టివ్ బ్యాండ్స్, LCD ప్యానెల్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగాన్ చిప్‌సెట్ టెక్నాలజీతో మోటో జి51 మొబైల్ రూపొందింది. 


Also read : Rs 500 note with green strip: రూ. 500 నోటుపై ఇలా ఉంటే అది Fake note అవుతుందా ?


బిజిఆర్ ఇండియా ప్రచురించిన ఓ వార్తా కథనం ప్రకారం మోటో జి51 మొబైల్ FHD+ LCD panel డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఫోన్ డిస్ ప్లే హ్యాంగ్ అవకుండా 120Hz రిఫ్రెష్ రేటు స్పీడుతో పనిచేయనుంది.


అందమైన సెల్ఫీలు, క్లియర్‌గా ఉండే వీడియో కాల్స్ (Video calls) కోసం ముందు భాగంలో 13MP పంచ్ హోల్ కెమెరాను అమర్చారు. 


ఫోన్ వెనుక భాగంలో ఉండే Mobile camera సెటప్‌తో పాటు మొబైల్ ధర, RAM స్టోరేజ్ వేరియంట్స్, తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Also read : Ram teaser from RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి రామ్‌ టీజర్ రిలీజ్ చేసిన Bheem 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook