Rs 500 note with green strip: రూ. 500 నోటుపై ఇలా ఉంటే అది Fake note అవుతుందా ?

Difference between fake notes and original notes: ఇటీవల కాలంలో 500 రూపాయల నోటు (Rs 500 notes latest news) విషయంలో కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఐదు వందల రూపాయల నోటుపై ఆకు పచ్చ రంగులో ఉండే మెరుపు తీగ (దీనినే సెక్యురిటీ థ్రెడ్ అని కూడా అంటారు) ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా మహాత్మా గాంధీ ప్రతిమకు దగ్గరిగా ఉన్నట్లయితే, ఆ నోటు చెల్లదు అని. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 08:37 PM IST
Rs 500 note with green strip: రూ. 500 నోటుపై ఇలా ఉంటే అది Fake note అవుతుందా ?

Difference between fake notes and original notes: కరెన్సీ నోట్ల గురించి తరచుగా ఏదో ఒక రూమర్ సోషల్ మీడియా వైరల్ అవుతుండటమో లేక జనం నోట్లోనో నానుతుండటం మనం చూస్తున్న విషయమే. 500 రూపాయల నోటు ఇలా ఉంటే అది చెల్లదని, త్వరలోనే 2000 రూపాయల నోట్లు బ్యాన్ అవుతాయని.. ఇలా రకరకాల రూమర్స్ ఎప్పుడూ చూస్తున్నవే. అలాగే ఇటీవల కాలంలో 500 రూపాయల నోటు (Rs 500 notes latest news) విషయంలో కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. 

అదేంటంటే.. ఐదు వందల రూపాయల నోటుపై ఆకు పచ్చ రంగులో ఉండే మెరుపు తీగ (దీనినే సెక్యురిటీ థ్రెడ్ అని కూడా అంటారు) ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా మహాత్మా గాంధీ ప్రతిమకు దగ్గరిగా ఉన్నట్లయితే, ఆ నోటు చెల్లదు అని. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండటంతో.. 500 రూపాయల నోటు తీసుకునేందుకు వ్యాపారులు, జనం వణుకుతున్నారు. కానీ వ్యాపారలావాదేవీల్లో, ఏటీఎంలలో 500 రూపాయల నోట్లు స్వీకరించక తప్పని పరిస్థితి. దీంతో రూ. 500 నోట్లు తీసుకోవాల్సి వచ్చిన ప్రతీసారి జనం ఒకటికి పదిసార్లు ఆ నోటును పరిశీలించిన (How to identify Rs 500 fake notes) తర్వాతే తీసుకుంటున్నారు. 

Also read : How to become rich with less investment, Magical Rs.1 Note: గంటలో లక్షాధికారిని చేసే 1 రూపాయి నోటు.. దీని ఖరీదు రూ.7 లక్షలు

ఇంతకీ అలాంటి 500 నోట్లు చెల్లవనే ప్రచారంలో నిజం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉందనే అంశంపై తాజాగా ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ (PIB fact check news) చేసి అసలు విషయాన్ని అదే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

 

రూ 500 నోట్లపై ఉండే గ్రీన్ స్ట్రిప్ (Security thread on Rs 500 notes) ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా గాంధీ ప్రతిమకు దగ్గరిగా ఉంటే ఆ నోటు చెల్లదు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో స్పష్టంచేసింది. అంతేకాకుండా ఆ రెండు నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పీఐబి (PIB) తేల్చిచెప్పింది.

Also read : Girls Molested by school principal in UP: ఆహారంలో మత్తు మందు కలిపి 17 మంది బాలికలపై ప్రిన్సిపల్ అత్యాచారం !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News