MTNL 25 Recharge Plan: రూ.25 రీఛార్జ్ తో 365 రోజులు వ్యాలిడిటీ అందిస్తున్న ప్రముఖ టెలికాం సంస్థ!
MTNL 25 Recharge Plan: భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ MTNL ఇప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెడుతోంది. కేవలం రూ. 25 రీఛార్జ్ తో ఏడాది పాటు వ్యాలిడిటీని కస్టమర్లకు అందజేస్తుంది. ఇంతకీ ఆ ఆఫర్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
MTNL 25 Recharge Plan: కస్టమర్లను ఆకర్షించేందుకు దేశంలోని ప్రముఖ టెలికాం నెట్ వర్క్ కంపెనీలు అనేక ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. నంబర్ వన్ స్థానాన్ని పొందేందుకు వినియోగదారుల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అలా తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు పొందే విధంగా ఇప్పుడు ఓ సంస్థ ప్రకటన తీసుకొచ్చింది. కేవలం రూ. 25 ఏడాది పొడవునా ప్రయోజనాలు పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్ ను చూసి జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లు షాక్ అవుతున్నారు.
రూ. 25లకే ఏడాది పాటు వ్యాలిడిటీ!
మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. కేవలం రూ. 25లకే 365 రోజుల వ్యాలిడిటీతో పాటు అనేక ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది. అయితే రీఛార్జ్ చేసిన మొదటి 30 రోజుల పాటు ఆ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. ఇందులో రూ. 10 లకు 100 లోకల్ MTNL నిమిషాల టాక్ టైమ్ తో పాటు 50 MB హైస్పీడ్ డేటా లభిస్తుంది.
ఇందులో లోకల్, STD కాల్ ఛార్జీలు సెకనుకు అర పైసా వసూలు చేస్తారు. అంతేకాకుండా సెకనుకు పైసా, సెకనుకు 6 పైసలు కూడా వసూలు చేస్తారని MTNL వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాలో ఒక్కో MBకి 3 పైసల చొప్పున వసూలు చేస్తారు.
షాక్ లో Jio-Airtel-Vi వినియోగదారులు..
మహనగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) సంస్థ.. కస్టమర్లు ఎంత ధరతో రీఛార్జ్ చేయించుకుంటే అంతే టాక్ టైమ్ ను కస్టమర్లకు అందజేస్తుంది. కానీ, JIO, Airtel, VI కస్టమర్లు మాత్రం ఉదాహరణకు.. రూ. 20 తో రీఛార్జ్ చేయించుకుంటే రూ. 14.95 టాక్ టైమ్ వస్తుంది. దీంతో ఆయా నెట్ వర్క్స్ ను యూజ్ చేస్తున్న వారంతా.. MTNL ఇస్తున్న ఆఫర్లకు షాక్ అవుతున్నాయి.
Also Read: Hike in Beer Prices: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్, పెరగనున్న బీరు ధరలు, ఒక్కొక్క బీర్ ఎంతంటే..??
Also Read: Redmi 10A Amazon: Redmi నుంచి మరో స్మార్ట్ ఫోన్.. అమెజాన్ లో సేల్ ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.